ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ క‌థానాయ‌కుడిగా జ్యోతికృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే సినిమా రిలీజ్ తేదీని కూడా ప్ర‌క‌టించారు. మార్చి 28న రిలీజ్ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. అయితే ఈ తేదీకి రిలీజ్ అవుతుందా? లేదా? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఇటీవ‌ల రిలీజ్ చేసిన బాబి డియోల్ న్యూలుక్ లో రిలీజ్ తేదీని ఓ కార్న‌ర్ లో వేసారు. దీంతో రిలీజ్ తేదీకి మేక‌ర్స్ అంత‌గా ప్రాధాన్య‌త ఇచ్చిన ట్లులేదు..మ‌ళ్లీ వాయిదా వేసే ఆలోచ‌న‌తోనే ఇలా సూచ‌న ప్రాయంగా హింట్ ఇచ్చార‌నే సందేహాలున్నాయి.తాజా స‌న్నివేశం చూస్తుంటే రిలీజ్ వాయిదా దాదాపు ఖ‌రారయ్యేలా ఉందనే సందేహాలు మ‌రింత బ‌ల‌ప డుతున్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ సినిమా కోసం ఇంకా నాలుగు రోజులు షూటింగ్ లో పాల్గొనాల్సి ఉందిట‌. కానీ ఆయ‌న ఇంత‌వ‌ర‌కూ ఆ నాలుగు రోజుల డేట్లు ఇవ్వ‌న‌ట్లు తెలుస్తోంది. ఎప్పుడు కేటాయిస్తారో? కూడా తెలియ‌ని ప‌రిస్థితి ఉందంటున్నారు. ఇప్ప‌టికే జ‌న‌వ‌రి పూర్త‌యింది. ఫిబ్ర‌వ‌రికి ఎంట‌ర్ అయిన ప‌రిస్థితి. ఆ నాలుగు రోజుల డేట్లు కేటాయిస్తాడ‌ని నెల రోజులుగా ప్ర‌చారంలో ఉంది. కానీ ఇంత‌వ‌ర‌కూ ఆ స‌న్నివేశం చోటు చేసుకోలేదు. ఆ నాలుగు రోజుల షూటింగ్ లో ప‌వ‌న్ పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించాల్సి ఉందిట‌.

ఆ స‌న్నివే శాల‌కు సంబంధించి విజువ‌ల్ ఎఫెక్స్ట్ కూడా రిచ్ గా చేయాల్సి ఉందిట‌. ఆ ప‌నుల కోసమే 15-20 రోజులు స‌మ‌యం ప‌డుతుందంటున్నారు. ఇంకా పెండింగ్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి చేయాల్సి ఉంది.ఇప్పటికే షూటింగ్ దాదాపు 60% పూర్తయింది. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో, మిగిలిన పార్ట్‌ను ఎప్పుడెప్పుడు కంప్లీట్ చేస్తారా అనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. కానీ టీమ్ మాత్రం పూర్తి కసరత్తుతో మిగిలిన షెడ్యూల్ ప్లాన్ చేస్తోంది. పవన్ కెరీర్‌లో అటువంటి మాస్ అప్పీల్ ఉండే సినిమాలు తక్కువే. కానీ OG మాత్రం అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉండబోతోందని చిత్ర యూనిట్ మాటల్లోనే స్పష్టమైంది.ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్‌డేట్స్ త్వరలో రాబోతున్నాయి. ఫిబ్రవరి లేదా మార్చిలో OG నుంచి మేజర్ అప్డేట్ రాబోతోందని మేకర్స్ నుంచి సమాచారం. ఇది టీజర్ అవుతుందా, స్పెషల్ వీడియో అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ మాసివ్ ప్రమోషన్ స్టార్ట్ చేయడానికి నిర్మాతలు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ వీరమల్లు పని ముగిసిన వెంటనే, తిరిగి OG మిగిలిన షూట్‌లో జాయిన్ అవ్వబోతున్నారని సమాచారం. ఈ సినిమా 2025 చివరలో విడుదలకు సిద్ధమవుతుందని టాక్ ఉంది. అయితే అధికారికంగా ఇంకా డేట్ కన్ఫర్మ్ కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: