ఏంటి బుజ్జి తల్లి అనే పాట శోభిత నాగచైతన్య మధ్య నిజంగానే చిచ్చు పెట్టిందా..నాగచైతన్య మాట్లాడిన మాటల్లో ఎంత నిజం ఉంది.ఇంతకీ నాగచైతన్య ఆ ఈవెంట్లో ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు చూద్దాం.. ఫిబ్రవరి 7న విడుదల కాబోతున్న తండేల్ మూవీకి సంబంధించి తాజాగా pre రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా జరిపారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా వస్తారని ముందు నుండి సమాచారం ఇవ్వడంతో అల్లు అర్జున్ ని చూడడానికి ఎంతో మంది అభిమానులు తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చారు. కానీ చావు కబురు చల్లగా చెప్పినట్టు చివర్లో అల్లు అర్జున్ వేరే పనిలో బిజీగా ఉండడం వల్ల రాలేకపోతున్నారు అని చెప్పారు. దాంతో అక్కడికి బన్నీ ని చూడడానికి ఎంతో ఆసక్తిగా వచ్చిన చాలామంది అభిమానులు నిరాశతో వెళ్లిపోయారు. అయితే తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిత్ర యూనిట్ మొత్తం పాల్గొంది. 

ఇందులో భాగంగా నాగచైతన్య ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టారు.. యాంకర్ సుమ బుజ్జి తల్లి అని ఎవరికి డెడికేట్ చేస్తారు అని అడగగా నా భార్య శోభితకు అని నాగచైతన్య సమాధానం ఇచ్చారు.అలాగే బుజ్జి తల్లి వల్ల శోభిత చాలా ఫీల్ అయిందని,ఎందుకంటే శోభితని నేను ఇంటిదగ్గర బుజ్జి తల్లి అని పిలుస్తాను. కానీ ఈ పదాన్ని సినిమాలో ఉపయోగించడమే కాకుండా పాట కూడా ఉండడంతో ఆమె చాలా ఫీల్ అయ్యింది. బుజ్జి తల్లి అనేది ఆమెకు సిగ్నేచర్ లాంటిది. అలాంటిది నువ్వు నీ సినిమాలో ఎలా వాడుకుంటావు అని శోభిత చాలా ఫీల్ అయింది అంటూ నాగచైతన్య చెప్పారు.

ఇక నాగచైతన్య మాట్లాడుతున్న సమయంలో డైరెక్టర్ కల్పించుకొని అవును ఈ విషయం నాకు కూడా తెలుసు. నేను వాళ్ళ పెళ్లికి వెళ్లిన సమయంలో బుజ్జితల్లి పదమే అనుకుంటే మీ సినిమాలో బుజ్జి తల్లి గురించి పాటే పెట్టుకున్నారు కదా అని ఆమె అన్నారు అంటూ డైరెక్టర్ చెప్పారు. అలా శోభితకు మాత్రమే పరిమితమైన బుజ్జి తల్లి అనే పాటని తన పర్మిషన్ లేకుండా సినిమాలో పెట్టుకునేసరికి కాస్త ఫీల్ అయినట్టు తెలియజేశారు.అలా బుజ్జి తల్లి అనే పదం నాగచైతన్య శోభిత ల మధ్య చిన్న పాటి చిచ్చు పెట్టింది అని చెప్పుకోవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి: