కే.జీ.ఎఫ్ సినిమా ద్వారా సౌత్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్టార్ హీరో ముద్ర వేసుకున్నారు  యష్.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన కేజిఎఫ్ చాప్టర్ -1 కేజీఎఫ్ చాప్టర్ 2 ద్వారా యష్ కి ఎక్కడలేని క్రేజ్ వచ్చింది.ఈ సినిమాల ద్వారా యష్ క్రేజ్ ఏకంగా ఆకాశాన్ని అంటింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే అలాంటి యష్ ప్రస్తుతం గీతా మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సీక్ అనే మూవీలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ టాక్సీక్ మూవీ గురించి ఎన్నో రోజుల నుండి ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి.కానీ సినిమా షూటింగ్ 2నెలలు నుండి జరుగుతుంది.. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా కరీనాకపూర్ నటిస్తుందని జాన్వి కపూర్ అంటూ ఇలా ఎంతో మంది హీరోయిన్ల పేర్లు తెరమీద వినిపించినప్పటికీ చివరికి బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని ఫిక్సయిందట. అయితే తాజాగా కియారా అద్వానీ నటనపై యష్ అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.

 ఈ విషయం గురించే శాండల్ వుడ్ లో తెగ చర్చ నడుస్తోంది.ఎందుకంటే గత నెల రోజుల నుండి టాపక్సిక్ సినిమాకు సంబంధించి షూటింగ్ జరుగుతుంది. అయితే ఆ షూటింగ్ కి సంబంధించిన రషెస్ చూసిన యష్ కి సన్నివేశాలు ఏమాత్రం నచ్చలేదట. ముఖ్యంగా కీయరా అద్వానీ నటన ఇందులో చాలా చెత్తగా ఉందని, డైరెక్టర్ పై ఫైర్ అయ్యారట. అంతేకాదు కియారా అద్వానీని తప్పించి మరో హీరోయిన్  ని తీసుకోండి అన్నట్లుగా పరోక్షంగా మాట్లాడుతున్నారట. అలాగే నెల రోజుల షూటింగ్ బూడిదలో పోసిన పన్నీరు మాదిరి అయ్యింది.అది మళ్లీ రీ షూట్ చేయాలని, ఈ సినిమాలో ఆమె యాక్టింగ్ బాలేక పోతే సినిమా ఫ్లాప్ అయితే నా జీవితమే నాశనం అవుతుంది అన్నట్లుగా మాట్లాడినట్టు తెలుస్తోంది.

 అంతేకాదు ఈ సినిమా రీ షూట్ చేయాలని నిర్మాతలని డిమాండ్ చేశారట.  అయితే ప్రస్తుతం ఈ విషయం గురించి జరుగుతున్న చర్చ శాండిల్ వుడ్ లో హాట్ టాపిక్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే యష్ పై కియర్ అద్వానీ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. ఆమె ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది.ఆమె నటన బాలేదు అనేవారు లేరు. అలాంటిది అసలు ఆమె నటనే బాలేదు అంటే ఎలా అని ఫైర్ అవుతున్నారు. మరి టాక్సిక్ విషయంలో వినిపిస్తున్న ఈ విషయాలన్నీ నిజమేనా..లేక రూమర్లా అనేది తెలియాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: