నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా చంద్రబాబు భార్య బాలకృష్ణ చెల్లెలు అన్నటువంటి భువనేశ్వరి గ్రాండ్గా పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ పార్టీకి నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు ఆయన చెల్లెళ్లు,బావలు నారావారి ఫ్యామిలీ పాల్గొన్నారు. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి కొంతమంది దర్శక నిర్మాతలు కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. అయితే ఈ పార్టీలో చెల్లెళ్లు బాలకృష్ణను ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు.అందులో ఒకటే బాలకృష్ణ ఫస్ట్ క్రష్.. మరి ఇంతకీ బాలకృష్ణ ఫస్ట్ క్రష్ ఎవరు.. ఆయన ఎవరికి  ఫస్ట్ లవ్ లెటర్ రాశారు అనేది ఇప్పుడు చూద్దాం.. నందమూరి బాలకృష్ణ కి మ్యాన్షన్ హౌస్ కి విడదీయలేని అనుబంధం ఉంటుంది. మ్యాన్షన్ హౌస్ అంటే బాలకృష్ణ  బాలకృష్ణ అంటే మ్యాన్షన్ హౌస్ అనేలా మారిపోయింది.ఎప్పుడైతే బాలకృష్ణ మ్యాన్షన్ హౌస్ తాగుతారు అని తెలిసిందో అప్పటినుండి ఈ డ్రింక్ కి కూడా డిమాండ్ పెరిగింది.

అలాగే మ్యాన్షన్ హౌస్ యాడ్ లో కూడా బాలకృష్ణని తీసుకున్నారు. అంతలా ఫేమస్ అయ్యింది. ఇక పురందరేశ్వరి మాట్లాడుతూ నువ్వు మొదటిసారి వసుంధరని ఎక్కడ చూసావు అని అడగగా నేను నాన్నగారు వైట్ హౌస్ దగ్గర కొత్త ఇంటికి భూమి పూజ చేస్తున్న సమయంలో ఆమెను చూసాను అని చెప్పారు. అలాగే వసుంధర ని చూశాక మీ రియాక్షన్ ఏంటి అని అడగగా చూడడంతోనే నచ్చేసింది ఓకే చేసాను అని చెప్పాడు. దానికి పురందరేశ్వరి కల్పించుకొని.. మరి నాన్నేమో నువ్వు ఎలాంటి ఆన్సర్ ఇవ్వడం లేదని, ఆలోచించుకుంటానని చెప్పావని నాతో అన్నారు నీ అభిప్రాయం ఏంటో నన్ను అడిగి తెలుసుకోమంటే ఆరోజు నేను నీ దగ్గరికి వచ్చి అడిగాను నాకు ఇంకా గుర్తుంది అంటూ బాలకృష్ణని ఇరికించింది పురందరేశ్వరి.

ఆ తర్వాత బాలా అన్నయ్య మీకు సినిమాలో ఫస్ట్ క్రష్ ఎవరు మీకు నచ్చిన హీరోయిన్ ఎవరు అని అడగగా.. నాకు ఫస్ట్ క్రష్ అంటూ ఏమీ లేదు. నాన్నగారు డైలాగ్ చెప్పినట్లుగా అంటూ బాలకృష్ణ డైలాగ్స్ చెప్పారు.అలాగేతనకు టాలీవుడ్ లో ఇష్టమైన హీరోయిన్లు రమ్యకృష్ణ,విజయశాంతి, సిమ్రాన్ అని చెప్పారు. అలాగే ఇప్పటివరకు మీరు ఎవరికైనా ప్రేమలేఖ రాశారా అన్నయ్య అని బాలకృష్ణ ని అడగగా నేను ఫస్ట్ లవ్ లెటర్ రాసింది వసుంధరకే...నేను లవ్ లెటర్ ఇస్తే నాకు ఓ గిఫ్ట్ కూడా ఇచ్చింది మీ వదిన అంటూ సమాధానం ఇచ్చారు. దానికి వసుంధర మాట్లాడుతూ..నేనేమి గిఫ్ట్ ఇవ్వలేదు. మీ అన్నయ్యే నాకు లవ్ లెటర్ ఇవ్వడంతో పాటు డ్రెస్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ డ్రస్సు లవ్ లెటర్ ఇప్పటికి కూడా నా దగ్గర భద్రంగా ఉన్నాయి అంటూ మాట్లాడింది. అలా బాలకృష్ణ తన మొదటి ప్రేమలేఖ తన భార్య వసుంధర దేవికి రాసినట్టు చెప్పారు

మరింత సమాచారం తెలుసుకోండి: