* సిద్ధార్థ్, షామిలి లవ్ స్టోరీ, యువన్ మ్యూజిక్ హైలైట్. రిలీజ్ టైమ్‌లో మిక్స్‌డ్ టాక్ వచ్చినా, తర్వాత కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
* బోల్డ్ ఎండింగ్, ఎమోషనల్ స్టోరీతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఇది తెలుగులో ఒక అండర్ రేటెడ్ జెమ్!
( తెలంగాణ - ఇండియా హెరాల్డ్)
"ఓయ్!" (2009) పేరు వినగానే యూత్ అంతా ఒకటే అంటారు "అరెరే.. ఈ సినిమానా? అండర్ రేటెడ్ మాణిక్యం ఇది" అని. ఆనంద్ రంగ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా నిజంగానే ఒక రొమాంటిక్ డ్రామా విందు. సిద్ధార్థ్, షామిలి జంటగా నటించిన ఈ మూవీలో సునీల్, అలీ వంటి స్టార్స్ కూడా ఉన్నారు. మ్యూజిక్ విషయానికొస్తే.. యూత్ హార్ట్ బీట్ యువన్ శంకర్ రాజా తన మ్యూజిక్‌తో మాయ చేశాడు. ఇప్పటికీ "ఓయ్" పాటలు వింటే చాలు.. వైబ్ వేరే లెవెల్‌లో ఉంటుంది.
కథలోకి వెళ్తే... ఉదయ్ (సిద్ధార్థ్) అంటే అచ్చంగా డబ్బున్న బ్యాచ్‌లర్. లైఫ్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ.. ఎలాంటి బాధ్యతలు లేకుండా గడుపుతాడు. సంధ్య (షామిలి) మాత్రం అందుకు పూర్తి విరుద్ధం. చాలా సీరియస్, ఇండిపెండెంట్ అమ్మాయి. తనకంటూ కొన్ని రూల్స్ పెట్టుకుని వాటి ప్రకారమే నడుచుకుంటుంది. ఉదయ్ మొదటి చూపులోనే సంధ్యని లవ్ చేస్తాడు. ఆమెకు దగ్గరవ్వడానికి పేయింగ్ గెస్ట్‌గా ఆమె ఇంట్లోనే దిగుతాడు. అలా వాళ్లిద్దరి మధ్య బాండింగ్ పెరుగుతున్న టైమ్‌లో ఉదయ్‌కి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. సంధ్యకి క్యాన్సర్ అని, కానీ ఆ విషయం సంధ్యకే తెలియదని తెలుసుకుంటాడు. ఇక అప్పటినుంచి సంధ్యకి మిగిలిన రోజుల్లో ఆమె కోరికలన్నీ తీర్చి, తనని హ్యాపీగా ఉంచాలని డిసైడ్ అవుతాడు ఉదయ్. క్లైమాక్స్ మాత్రం గుండెల్ని పిండేసేలా ఉంటుంది.
"ఓయ్!" 2009, జులై 3న రిలీజ్ అయింది. అప్పట్లో మిక్స్‌డ్ టాక్ వచ్చింది, యావరేజ్ కలెక్షన్స్ రాబట్టింది. కానీ టైమ్ గడిచే కొద్దీ ఈ సినిమాకి ఫ్యాన్స్ పెరిగిపోయారు. కల్ట్ క్లాసిక్‌గా మారిపోయింది. లవర్స్ డే సందర్భంగా 2024లో మళ్లీ రిలీజ్ చేస్తే.. అప్పుడు చాలామంది "సినిమాలోని పాటలే కాదు.. స్టోరీ కూడా ఎంత ఎమోషనల్‌గా ఉందో" అని తెగ మెచ్చుకున్నారు.
రివ్యూవర్స్ కూడా మిక్స్‌డ్‌గా రియాక్ట్ అయ్యారు. హీరోయిన్ చనిపోయే ఎండింగ్‌తో తెలుగులో సినిమా తీయడానికి చాలా దమ్ముండాలి అని బోల్డ్‌గా కామెంట్ చేశారు. షామిలికి ఈ సినిమాలో యాక్టింగ్ చేసినందుకు గానూ బెస్ట్ ఫిమేల్ డెబ్యూగా సినీమా అవార్డు కూడా వచ్చింది.
సిద్ధార్థ్ ఉదయ్ క్యారెక్టర్‌లో ఫుల్ ఎనర్జీతో అదరగొట్టాడు. సినిమా మొత్తం 80% టైమ్ సన్‌గ్లాసెస్ పెట్టుకునే కనిపించాడు. పాటల్లో కూడా అవే గ్లాసెస్‌తో స్టైలిష్‌గా కనిపించాడు. షామిలి కూడా బాగానే యాక్ట్ చేసింది కానీ.. ఇంకాస్త మేకప్ బాగుంటే లుక్ ఇంప్రూవ్ అయ్యేది అనిపించింది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. షామిలి ఇంతకుముందు మణిరత్నం "అంజలి" సినిమాలో జబ్బున్న పాపగా నటించి నేషనల్ అవార్డ్ కొట్టింది. మళ్లీ ఇన్నాళ్లకు "ఓయ్!" లో కూడా అలాంటి రోల్ చేయటం కోయిన్సిడెన్స్ అంతే.
కృష్ణుడు బాగా చేశాడు, సునీల్ కామెడీ ఫస్ట్ హాఫ్‌లో కొంచెం వీక్‌గా ఉన్నా సెకండ్ హాఫ్‌లో మాత్రం నవ్వించాడు. ఇక ఇందులో గుర్తుండిపోయే సీన్స్ గురించి మాట్లాడుకుంటే "ఓయ్!" సినిమాలో మూడు సీన్స్ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అందులో మొదటిది 12వ పుట్టినరోజు గిఫ్ట్ సీన్స్ (అమ్మాయి, అబ్బాయి వెర్షన్ రెండూ) చాలా యూనిక్‌గా, ఎమోషనల్‌గా ఉంటాయి. రెండోది ప్రదీప్ రావత్ ఛత్రపతి క్యారెక్టర్‌ని కంటిన్యూ చేయడం అనేది ఒక క్రియేటివ్ టచ్. రాధా కుమారి, రవి కొండల రావు కలిసి చేసిన ట్రైన్ సీన్ అయితే హైలైట్. నవ్వు ఆపుకోలేం.
మొత్తానికి "ఓయ్!" సినిమా స్టార్టింగ్‌లో స్లోగా ఉన్నా కానీ తెలుగు సినిమాలో ఒక అండర్ రేటెడ్ జెమ్ అని చెప్పొచ్చు. ఎమోషనల్ స్టోరీ లైన్, మెమొరబుల్ మ్యూజిక్ వల్ల ఈ సినిమా చాలామందికి ఫేవరెట్ అయిపోయింది.