సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలు ఎక్కువగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారుతున్నాయి.  మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబుకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తూ ఉండడం గమనార్హం. "గుంటూరు కారం" సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మహేష్ బాబుని ఏ రేంజ్ లో ట్రోల్ చేసారో జనాలు మనందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా ఆయన కెరియర్ లో ఎన్నో ఫ్లాప్ సినిమాలు అందుకున్నప్పటికీ అన్నిటికన్నా ఈ సినిమా ఫ్లాప్ అయిన కారణంగా ఎదుర్కొన్న ట్రోల్లింగ్ ఎక్కువ . కాగా ప్రజెంట్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు . ఈ సినిమా కోసం ఏకంగా మహేష్ బాబు నాలుగు సంవత్సరాల కాల్ షీట్స్ ఇచ్చేసారట .


అంతేకాదు మహేష్ బాబు - రాజమౌళి సినిమా కోసం ఏకంగా 12 కేజీల బరువు తగ్గారట.  రీసెంట్ గానే మహేష్ బాబు పాస్ పోర్ట్ సైతం రాజమౌళి లాగేసుకున్నాడు . దీనికి సంబంధించిన ఫన్నీ వీడియోస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది . కాగా ఇప్పుడు మహేష్ బాబుకు సంబంధించిన కొన్ని పర్సనల్ విషయాలు కూడా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి . మరి ముఖ్యంగా మహేష్ బాబు - నమ్రత కి సంబంధించిన కొన్ని ఫన్నీ వార్తలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి . మనకు తెలిసిందే మహేష్ బాబు - నమ్రత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  వీళ్ళ పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఫస్ట్ ఒప్పుకోలేదు . ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకున్నారు.



అయితే మహేష్ బాబు - నమ్రత కోసం బిగ్ శాక్రిఫైజ్ చేశాడు అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది. మొదటి నుంచి మహేష్ బాబు మంచి ఫుడీ.  బాగా ఇష్టమైన ఫుడ్ ని ఎక్కువగా తినేస్తాడు.  అయితే ఎప్పుడైతే - నమ్రత ని పెళ్లి చేసుకున్నాడో.. అప్పటినుంచి ఆమె కండిషన్స్ కి టోటల్ మారిపోయాడు మహేష్ బాబు . నమ్రత హెల్త్ పట్లా చాలా కేర్ గా ఉంటుంది . మరీ ముఖ్యంగా ఫిట్నెస్ విషయంలో ఇంత వయసు వచ్చిన నమ్రత ఇంత ఫిట్ గా ఉండడానికి కారణం ఆమె ఫాలో అయ్యే డైట్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నమ్రత కోసమే మహేష్ బాబు తన ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ అన్ని వదిలేసుకున్నారట.  మరి ముఖ్యంగా మహేష్ బాబుకి స్వీట్ ఐటమ్స్ ఎక్కువగా ఇష్టంగా ఉండేదట . అయితే అలా స్వీట్ ఐటమ్స్ ఎక్కువగా తింటే అనారోగ్యాలకు గురవ్వాల్సి వస్తుంది అంటూ మహేష్ బాబు భార్య ఆయన ఫుడ్ డైట్ ఛార్ట్  మొత్తం మార్చేసిందట . ఇప్పుడు మహేష్ బాబు ఒక స్వీట్ తినాలన్నా సరే నమ్రత పర్మిషన్ ఉండాల్సిందే . ఆమె కోసం ఆయన ఎంతో ఇష్టంగా తినే ఫుడ్ ని కూడా సాక్రిఫైజ్ చేసేసాడు . అంత ఇష్టం నమ్రత అంటే మహేష్ బాబుకి అంటూ జనాలకు వీళ్ల గురించి మాట్లాడుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: