ఆ హీరోయిన్ మరెవరో కాదు బాలీవుడ్ హాట్ బ్యూటీ అందాల ముద్దుగుమ్మ "కత్రినా కైఫ్". వెంకటేష్ - కత్రినా ల కాంబోలో వచ్చిన సినిమా "మల్లీశ్వరి". ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే జనాలు ఎంత పగలబడి నవ్వుకుంటారు అనే విషయం అందరికీ తెలుసు. కాగా సోషల్ మీడియాలో ఇప్పుడు మల్లీశ్వరి సినిమా షూట్ కి సంబంధించిన కొన్ని వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. కత్రినా కైఫ్ ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి షూటింగ్లో పాల్గొనేదట . కొన్ని కొన్ని సార్లు ఆలస్యంగా షూటింగ్ కి వచ్చేదట .
అంతేకాదు ఆ టైంలో సైతం వెంకటేష్ పైనే ఎక్కువగా సీన్స్ షూట్ చేసేలా ప్లాన్స్ మొత్తం మార్చేసేదట. మరీ ముఖ్యంగా షూటింగ్ టైంలో వెంకటేష్ కి చుక్కలు చూపించేదట . తెలుగు రాదు తెలుగులో డైలాగ్ చెప్పడానికి వెంకటేష్ హెల్ప్ తీసుకునేదట. అయితే వెంకటేష్ చెప్పిన పని మాత్రం అస్సలు చేయట . వెంకటేష్ చెప్పినా డైలాగ్ ని అలా కాకుండా వేరే మాడ్యులేషన్ లో చెప్పి అసలు డైలాగ్ కి ఉన్న మీనింగ్ ఏ మార్చేసేదట . అంతేకాదు షూటింగ్ టైంలో ఎక్కువగా ఫ్రెండ్స్ తో ఫోన్లో మాట్లాడుతూ ఉండడం. చెప్పిన టైం కన్నా కూడా ఆలస్యంగా రావడం లాంటివి చేస్తూ వచ్చిందట . ఆ టైంలో ఆ హీరోయిన్ ని ఏమీ అనలేక మూవీ టీం సైతం సైలెంట్ గా ఉండిపోయారట. ఫైనల్లీ సినిమా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అందుకుంది .