త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమాలు అంటే అవి ఎంత మంచి మెసేజ్ ఎన్ని మంచి మంచి డైలాగులను మనకు అందిస్తాయో చెప్పనక్కర్లేదు. అయితే అలాంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా చేసిన ఖలేజా సినిమా అందరూ చూసే ఉంటారు.మహేష్ బాబు హీరోగా అనుష్క హీరోయిన్ గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ నిరాశను మిగిల్చింది. ఈ సినిమా థియేటర్లలో విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకుంది. కానీ ఈ సినిమా తెలివిజన్లో విడుదలైన సమయంలో మాత్రం సంచలనం సృష్టించింది.ఎందుకంటే థియేటర్లో విడుదలైన ఖలేజా ఫ్లాఫ్ అయితే టెలివిజన్లో వచ్చిన ఖలేజా మూవీ మాత్రం సంచలనం సృష్టించింది.ఇప్పటికి కూడా ఖలేజా మూవీ విడుదలయితే హైయ్యెస్ట్ టిఆర్పి రేటింగ్ ఆ ఛానల్ కి ఉంటుంది. అలా థియేటర్లో ఫ్లాప్ చేసి టెలివిజన్లో మాత్రం సినిమాని బాగా ఆదరించారు.ఒకరకంగా చెప్పుకోవాలంటే ఈ సినిమాని బాలేదని థియేటర్లో వదిలేసారు కానీ అదే సినిమా టీవీలలో వస్తే ఎగబడి మరీ చూస్తున్నారు.

అంతేకాదు ఈ  2020  సంవత్సరాలలో విడుదలయితే ఖచ్చితంగా అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేదని చాలామంది మాట్లాడుకుంటారు. మరి అలాంటి టాలీవుడ్ అండర్ రేటెడ్ మూవీలలో ఒకటైన ఖలేజా మూవీ ఫ్లాప్ అవ్వడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో అనుష్క మహేష్ బాబుకి అక్కలా ఉందని హీరోయిన్గా అసలు సెట్ అవ్వలేదని చాలామంది ఈ సినిమా చూసి మాట్లాడుకున్నారు. అలాగే సినిమా మొత్తం బాగున్నప్పటికీ సినిమాలోని కొన్ని కొన్ని వరస్ట్ సన్నివేశాల వల్ల సినిమా ప్లాఫ్ అయింది అంటారు.ముఖ్యంగా ఈ సినిమాలో ఓ ఫైట్ జరుగుతున్న సమయంలో మహేష్ బాబు ఇసుకలో ఎప్పుడో పాతుకుపోయిన ఒక బైక్ ని తీసి ఒకే ఒక్క కిక్ తో స్టార్ట్ చేసి వెళ్ళిపోతారు. అయితే ఇది చాలామందికి కన్విన్సింగ్ గా అనిపించలేదు.

అన్ని రోజులు ఇసుకలో కూరుకుపోయిన బైక్ ఒక్క కిక్ తో ఎలా స్టార్ట్ అవుతుంది అని చాలామంది మాట్లాడుకున్నారు. అంతేకాదు మహేష్ బాబు అక్కడకి వచ్చిన రౌడీలు అందరినీ కొట్టిన కూడా వావ్ అనేవారేమో కానీ ఎప్పుడో పాతుకుపోయిన బైక్ ని తీసి ఒక కిక్ తో స్టార్ట్ చేయడంతో చాలామంది దాన్ని వరస్ట్ సీన్ అన్నారు. అలా రెండు మూడు వరస్ట్ సీన్స్ వల్ల ప్రేక్షకులకు థియేటర్లో బోర్ కొట్టింది అయితే ఈ సినిమా థియేటర్లో ప్రేక్షకులకు ఎందుకు నచ్చలేదో టీవీలలో ఎందుకు వచ్చిందో తెలియదు.కానీ ఈ సినిమా ఎప్పుడు వచ్చినా కూడా ప్రేక్షకులు దానికి హైయ్యెస్ట్ టిఆర్పి రేటింగ్ ఇస్తారు. ఇక ఇప్పటికి కూడా ఈ సినిమాని చూసిన చాలామంది అభిమానులు ఈ సినిమాని త్రివిక్రమ్ బాగానే తెరకెక్కించారు కానీ మనం థియేటర్లో దీన్ని బాగా ఆదరించలేదు మనం సినిమాని ఆదరించకపోవడం వల్లే ఫ్లాఫ్ అయింది అని అంటూ ఉంటారు

మరింత సమాచారం తెలుసుకోండి: