పైగా తెలంగాణలో టికెట్స్ రేటు పెంచము అంటూ ఓపెన్ గానే చెప్పుకొచ్చాడు రేవంత్ రెడ్డి. దీంతో బిగ్ సమస్య వచ్చి చేరింది. అయితే పాన్ ఇండియా స్టార్ హీరోలకు ఇది నిజంగా గడ్డు కాలం అంటున్నారు జనాలు . వాళ్ళు నటించే సినిమాలు ఫ్లాప్ అవుతుంటే వాళ్ళ హీరోయిజంకి పెద్ద పరీక్ష గానే మారిపోతుంది . రీసెంట్ గా చరణ్ "గేమ్ ఛేంజర్" సినిమాతో ఎలాంటి ప్లాప్ టాక్ సంపాదించుకున్నాడో అందరికి తెలిసిందే.
రామ్ చరణ్ ని బాగా ట్రోల్ చేశారు. కానీ సినిమా డైరెక్ట్ చేసిన శంకర్ ని మాత్రం జనాలు ఏమీ అనలేదు . సినిమాకి కమిట్ అయిన రామ్ చరణ్ ని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు . గతంలో దేవర విషయంలోనూ అంతే జూనియర్ ఎన్టీఆర్ నే ట్రోల్ చేశారు . కొరటాల శివ సైలెంట్ గా వదిలేశారు , అయితే ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలకి మించిన రేంజ్ లో పబ్లిసిటీ పాపులారిటీ సంపాదించుకుంటున్నారు డైరెక్టర్స్ అని .. ఇదేవిధంగా కొనసాగితే స్టార్ హీరోల సినిమాలు మొత్తం బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అయితే ఫ్యూచర్లో డైరెక్టర్ లే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంటారు అని .. హీరోలకి అంత సీన్ ఉండదు .. వాళ్ళు జీరోలు అయిపోతారు అని జనాలు మాట్లాడుకుంటున్నారు . ఇకనైనా హీరోలు కళ్ళు తెరిచి సినిమాకి ఎలా పబ్లిసిటీ చేసుకోవాలి సినిమాకి ఎలా కలెక్షన్స్ రాబట్టే విధంగా చేసుకోవాలి అని ఆలోచిస్తే బాగుంటుంది అంటూ సజెషన్స్ కూడా ఇస్తున్నారు..!