మాస్ మహారాజ్ రవితేజ, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. వీరి కాంబినేషన్ లో ఇప్పటికే 5 సినిమాలు వచ్చాయి.. వాటిలో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్నతమిళ అమ్మాయి వంటి సినిమాలు సూపర్ హిట్ గా నిలవడమే కాదు హీరోగా రవితేజ కెరీర్ ని సైతం నిలబెట్టాయి.. ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా ఉంటున్నా రవితేజకు 30 ఏళ్లకు హీరోగా అవకాశం వచ్చింది.. వచ్చిన ప్రతీ అవకాశాన్ని రవితేజ చక్కగా వాడుకొని మాస్ మహారాజ్ గా ఎదిగాడు.. పూరి, రవితేజ కాంబోలో సినిమా అంటే అప్పట్లో విపరీతమైన క్రేజ్ ఉండేది.. వరుసగా మూడు సినిమాలు హిట్ అవడంతో వీరి కాంబోలో తరువాత వచ్చే సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి.. వీరి కాంబోలో వచ్చిన నాలుగో సినిమా “ నేనింతే “..


ఈ సినిమాలో డైరెక్టర్ అవ్వాలని అనుకొనే రవి పాత్రలో రవితేజ నటించారు.. ఆ ప్రక్రియలో అతనికి ఎదురైనా కష్టాలు, అవమానాలు,బాధలు ఈ సినిమాలో దర్శకుడు పూరి చూపించాడు.. అంతేకాదు సినిమా పరిశ్రమలోని కష్టాలు సైతం పూరి కళ్ళకు కట్టినట్లు చూపించాడు.. తన మార్క్ డైలాగ్స్ తో సినిమాకి ఎంతో క్రేజ్ తీసుకోని వచ్చారు..దర్శకుడు, నిర్మాత, హీరో,హీరోయిన్,ఫ్యాన్స్ ఒక సినిమా ప్లాప్ అయితే ఎంతలా ఎఫెక్ట్ అవుతారో పూరి తన బాధనంతా కలగలిపి తెరకెక్కించిన సినిమానే “నేనింతే”...2008 లో విడుదల అయిన ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు అంతగా ఎక్కలేదు.. దీనితో అప్పట్లో ఈ సినిమా ప్లాప్ అయింది..


కానీ ఆ సినిమాలో పూరి చూపించిన ప్రతీ సీన్స్ ప్రస్తుత ప్రేక్షకులకు కళ్ళకి కట్టినట్లు కనపడటంతో ఫ్యాన్స్ రియలైజ్ అయ్యారు.. నేనింతే సినిమాను రీరిలీజ్ చేసి ప్రతీ సీన్ కి విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేసారు..ప్రస్తుతం వరుస ప్లాప్స్ ఇస్తున్న పూరీని ఉద్దేశించి మాకు వింటేజ్ పూరీ కావాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..నేనింతే వంటి క్లాసిక్ సినిమాను ఎలా ప్లాప్ చేశామా అని ఫ్యాన్స్ ఇప్పటికీ ఫీల్ అవుతున్నారు..ఈ సినిమాలో సిట్యుయేషన్ కి తగ్గట్టు మ్యూజిక్ డైరెక్టర్ చక్రీ ఇచ్చిన సాంగ్స్ ఇప్పటికీ ఎవర్గ్రీన్ అని చెప్పొచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: