సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు భారీ అంచనాల నడుమ విడుదల అవుతూ ఉంటాయి. అలా విడుదల అయిన సినిమాలు ఏ కాస్త ప్రేక్షకులను ఆకట్టుకోకపోయినా వాటికి నెగటివ్ టాక్ రావడం వల్ల కలెక్షన్లు కూడా రాకపోవడంతో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇకపోతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ "చిరుత" అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యి , ఆ తర్వాత మగధీర అనే మూవీతో ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు.

ఇలా మగధీర మూవీతో ఇండస్ట్రీ హిట్ ను అందుకున్న చరణ్ ఆ తర్వాత ఆరెంజ్ అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుండి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే నెగటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చుకుంది. ఇక సినిమా విడుదల అయ్యి ఫ్లాప్ అయిన తర్వాత ఈ మూవీ టీవీలో ప్రసారం అయిన సమయంలో మాత్రం ఈ మూవీపై ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపించడం మొదలు పెట్టారు. అది అద్భుతమైన సినిమా కానీ ఆ సమయంలో వచ్చేది కాదు , ఆ సినిమా కనుక ఓ పది సంవత్సరాల తర్వాత విడుదల అయి ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యేది అనే అభిప్రాయాలను చాలా మంది వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.

ఇకపోతే కొంత కాలం క్రితం ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. అలా విడుదల అయిన సమయంలో ఈ మూవీకి నెగిటివ్ టాక్ వచ్చిన ఆ తర్వాత మాత్రం ఈ సినిమాపై ప్రేక్షకుల నుండి అద్భుతమైన ప్రశంసలు రావడం మొదలు అయింది. ఇప్పటికీ కూడా ఈ సినిమా బుల్లి తెరపై ప్రసారం అయినట్లయితే మంచి టిఆర్పి రేటింగ్ ను దక్కించుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: