అయితే అదృష్టం దిల్ రాజ్ కు ‘సంక్రాంతికి వస్తున్నాం’ రూపంలో వచ్చి ఆయన ఆర్ధిక సమస్యలు అన్నీ తీర్చివేసింది. దీనితో ఫుల్ జోష్ లో ఉన్న దిల్ రాజ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ డిస్ట్రిబ్యూటర్లతో కలిసి ఏర్పాటు చేసిన సక్సస్ ప్రెస్ మీట్ లో ‘గేమ్ చేంజర్’ విషయమై తన మనసు అసహనాన్ని ఆవేదనను పరోక్షంగా వ్యక్త పరిచాడు. ఒక సినిమా విజయానికి కావలసింది. భారీ బడ్జెట్ కాదనీ కంటెంట్ అని అభిప్రాయపడుతూ కాంబినేషన్లను నమ్ముకుని సినిమాలు తీస్తే లాభం లేదు అంటు సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు తమ సంస్థలో క్లాసిక్స్, బ్లాక్ బస్టర్లుగా నిలిచిన సినిమాలన్నీ కథను నమ్ముకుని చేసినవి అంటూ తాను తీసిన సినిమాలలో కొత్త దర్శకులను నమ్ముకుని తీసిన సినిమాలు ఘన విజయం సాధించిన సినిమాలు ఎక్కువగా ఉన్న విషయం గురతుకూ చేసుకున్నారు. చాలామంది నిర్మాతల లాగే తాను కూడ కాంబినేషన్ ను నమ్ముకుని సినిమాలు తీసి ఎదురు దెబ్బలు తిన్నానని కామెంట్ చేశారు.
అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తనకు సినిమా మేకింగ్ విషయంలో అదేవిధంగా ప్రేక్షకుల అభిరుచి పై పూర్తి క్లారిటీ వచ్చింది అంటూ ఈమూవీ తనకు సినిమా మేకింగ్ విషయంలో ఒక పాఠం నేర్పింది అంటూ అభిప్రాయ పడ్డారు. అయితే అన్ని సినిమాలు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు లా బ్లాక్ బష్టర్ హిట్స్ కావు. ఒక లాటరీ టిక్కెట్ లా అనుకోని ఘన విజయం ఆమూవీకి రావడం ఒక విధంగా దిల్ రాజ్ అదృష్టం అనుకోవాలి..