కొత్త సంవత్సరం వచ్చి అప్పుడే ఒకనెల గడిచిపోయింది. గత నెల సంక్రాంతికి విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ తప్ప గత నెలలో విడుదలైన ఏసినిమా నిర్మాతలకు లాభాలను తెచ్చి పెట్టలేదు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ కేవలం బ్రేక్ ఈవెన్ మాత్రమే తెచ్చుకుంది అని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఫిబ్రవరి 7న విడుదలకాబోతున్న నాగచైతన్య ‘తండేల్’ మూవీతో మళ్ళీ ధియేటర్లకు కళ ఏర్పడుతుందని అంచనాలు ఉన్నాయి.



ఈమూవీ ప్రీరిలీజ్ టాక్ కూడ బాగా ఉండటంతో కలక్షన్స్ విషయంలో ఈమూవీ మంచి రికార్డులను క్రియేట్ చేస్తుంది అన్న అంచనాలు ఇండస్ట్రీ వర్గాలకు ఉన్నాయి. ఇలాంటి మూవీతో పూరీ జగన్నాథ్ తమ్ముడు ram SHANKAR' target='_blank' title='సాయి రామ్ శంకర్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సాయి రామ్ శంకర్ హీరోగా నటిస్తున్న మూవీ విడుదల అవుతూ ఉండటం చాలామందికి షాక్ ఇస్తోంది. గతకొంత కాలంగా ఈహీరో నటిస్తున్న సినిమాలు అన్నీ ఫెయిల్ అవ్వడంతో అతడి మార్కెట్ పూర్తిగా దెబ్బ తింది.



గతంలో బంపర్ ఆఫర్ మూవీలో నటించి హిట్ అందుకున్న ఈహీరో పూరీ జగన్నాథ్ సపోర్ట్ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నప్పటికీ ram SHANKAR' target='_blank' title='సాయి రామ్ శంకర్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సాయి రామ్ శంకర్ కెరియర్ ఏమాత్రం ముందుకు సాగడంలేదు. లేటెస్ట్ గా విడుదల అవుతున్న ఈమూవీ క్రైమ్ జోనర్ మూవీ అని అంటున్నారు. ఈసినిమా పై ఆశక్తి సగటు ప్రేక్షకులలో పెంచడానికి ఈమూవీ ఇంటర్వెల్ లో హంతకుడు ఎవరో కనిపెట్టగలిగితే ప్రతి థియేటర్ లో ఒక లక్కీ విజేతకు పది వేల రూపాయలు గిఫ్ట్ ఇస్తామని ప్రకటించారు. అయితే ఇలాంటి స్కీమ్ లు ఎంతవరకు వర్కవుట్ అవుతాయి అన్నది సమాధానం లేని ప్రశ్న.  



ఈసినిమా విడుదలకు ఒకరోజు ముందు అజిత్ నటించిన ‘పట్టుదల’ సినిమా కూడ విడుదల అవుతుంది. ఈ రెండు సినిమాల మధ్య ram SHANKAR' target='_blank' title='సాయి రామ్ శంకర్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సాయి రామ్ శంకర్ మూవీ ఎందుకు విడుదల అవుతుంది అన్నది ప్రస్తుతానికి ఎవరీ అర్థంకాని విషయంగా మారింది. అంతేకాదు ఫిబ్రవరి 14న మరో మూడు సినిమాలు రాబోతున్నాయి. ఇన్ని సినిమాల మధ్య ఏమాత్రం క్రేజ్ లేని సాయి శంకర్ మూవీ ఎంతవరకు సక్సస్ అవుతుంది అన్నది ఎవరికీ అర్థంకాని విషయం..  



మరింత సమాచారం తెలుసుకోండి: