సినిమా ఇండస్ట్రీలో కొన్ని అండర్ రేటెడ్ మూవీలుగా మిగిలిపోతూ ఉంటాయి. అలాంటి సినిమాలు విడుదల అయిన సమయంలో బాక్సా ఫీస్ దగ్గర పెద్దగా ఇంపాక్ట్ చూపకపోయినా థియేటర్ల నుండి వెళ్లిపోయాక మాత్రం ఆ సినిమాలకు అద్భుతమైన ఆదరణ దక్కుతూ ఉంటుంది. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటుడిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో గోపీచంద్ ఒకరు. గోపీచంద్ కెరియర్ లో కూడా అలాంటి అండర్ రేటెడ్ మూవీ ఒకటి ఉంది. గోపీచంద్ కొన్ని సంవత్సరాల క్రితం సంపత్ నంది దర్శకత్వంలో గౌతమ్ నంద అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే.

మూవీ లో గోపీచంద్ రెండు పాత్రల్లో నటించాడు. ఈ రెండు పాత్రల్లో కూడా ఈయన తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల ఆయన సమయంలో ప్రేక్షకుల నుండి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి కలెక్షన్లను వసూలు చేయలేదు. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయింది. కానీ ఈ సినిమాకు ఆ తర్వాత మాత్రం మంచి రెస్పాన్స్ జనాల నుండి రావడం మొదలు అయింది. ఈ సినిమాకు థియేటర్లలో విడుదల అయిన సమయంలో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రాలేదు ... వచ్చి ఉంటే ఈ మూవీ అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకునేది అనే అభిప్రాయాలను కూడా చాలా మంది వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.

ఇక విడుదల సమయంలో ప్రేక్షకులను నిరుత్సాహ పరిచిన ఈ సినిమా ఇప్పటికీ కూడా బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు మంచి టీఆర్పి రేటింగును సంపాదించుకుంటుంది. ఇక ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా గోపీచంద్ మాట్లాడుతూ ... గౌతమ్ నంద సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంటుంది అని సినిమా షూటింగ్ సమయంలో అనుకున్నాను. కానీ అది జరగలేదు అని కూడా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Gc