అయితే ఇప్పుడు ప్రభాస్ ని అల్లు అర్జున్ సోషల్ మీడియాలో జనాలు ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తూ వైరల్ గా మార్చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో మల్టీస్టారర్ మూవీలు ఎక్కువగా చేస్తున్నారు. అయితే రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ - మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు కూడా అలా మల్టీ స్టారర్ ల మూవీలో నటించి మెప్పించి మంచి హిట్స్ తమ ఖాతాలో వేసుకుని.. మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కి అదేవిధంగా అల్లుఅర్జున్ ఫ్యాన్స్ కి ఆ కోరిక ఇంకా తీరలేదు.
వీళ్ళు కూడా మల్టీస్టారర్ మూవీలో నటించి అలాంటి ఒక క్రేజీ డ్యూయెల్ హిట్ తమ ఖాతాలో వేసుకుంటే బాగుంటుంది అంటూ ఆశపడుతున్నారు ఫ్యాన్స్. అంతేకాదు ప్రభాస్ - అల్లు అర్జున్ ఇద్దరు పాన్ ఇండియా స్టార్సెస్. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ..ఇక వీళ్ల కాంబోలో సినిమా వస్తే మాత్రం రచ్చ రంబోలా అంటున్నారు జనాలు. మరి వీళ్ళిద్దరి కాంబోలో స్క్రిప్ట్ ఓకే చేయించే విధంగా కథను రాసే డైరెక్టర్ ఎక్కడ ఉన్నాడో..? ఆ దమ్ము ఎవరికీ ఉందో..? అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . ఈగో పక్కన పెట్టేసి ఒక్కసారి హీరోలు కలిసి మల్టీస్టారర్ మూవీలో నటిస్తే మాత్రం అది నిజంగా ఇండస్ట్రీ బ్రేకింగ్ రికార్డ్స్ వసూలు చేస్తుంది అంటూ మాట్లాడుకుంటున్నారు . చూద్దాం మరి ఆ టైం ఎప్పుడు వస్తుందో..??