గత ఏడాది తాను ప్రేమించిన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీని వివాహం చేసుకుంది. ఆ తర్వాత హనీమూన్ కు వెళ్లిపోయిన కీర్తి సురేష్ బేబీ జాన్ సినిమా ప్రమోషన్స్ లో పసుపు తాడుతో కనిపించి అందరి చేత ప్రశంసలు కూడా అందుకున్నది.. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా మారడంతో కొంతమేరకు గ్యాప్ ఇచ్చి తన భర్తతో మళ్ళీ వెకేషన్ కి వెళ్ళిపోయింది కీర్తి సురేష్. అయితే ఆ తర్వాత మళ్లీ కొన్ని ఫోటోలను షేర్ చేయగా వైరల్ గా మారుతున్నాయి. ఇప్పుడు తాజాగా మళ్లీ కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
అయితే ఇందులో కీర్తి సురేష్ తాళిబొట్టు లేకుండా కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.పెళ్లి అయినప్పటి నుంచి సాంప్రదాయమైన లుక్కులో కనిపించిన ఈమె ఇప్పుడు తాజాగా తన ఎద, నడుము అందాలను చూపిస్తూ రెచ్చగొట్టేలా చేస్తోంది. ఈ ఫోటోలు చూసిన వారందరూ కూడా కీర్తి సురేష్ ని తాళి ఎక్కడ అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది సెటైరికల్ గా కామెంట్స్ చేస్తే నెల రోజులు కాకుండా అని పక్కకు పడేసావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయం పైన కీర్తి సురేష్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.