టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబం నుంచి చాలామంది హీరోలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ కుటుంబం నుంచి ఎంతమంది హీరోలు వచ్చినా... మెగాస్టార్ చిరంజీవి కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. అలాంటి రామ్ చరణ్ చిరుత సినిమాతో.. ఇండస్ట్రీలో అడుగుపెట్టి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత రామ్ చరణ్ తీసిన సినిమాలన్నీ... బాగానే హిట్ అయ్యాయి. మగధీర అలాగే  RRR సినిమాలతో రామ్ చరణ్ కెరీర్ ఒక రేంజ్ కి వెళ్ళింది.


అయితే రామ్ చరణ్ చేసిన సినిమాలలో ధ్రువ ఒకటి. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా... రామ్ చరణ్ అదరగొడతాడు. రామ్ చరణ్ హీరోగా చేసిన ఈ సినిమాలో ఆయన సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో... తమిళ హీరో అరవిందస్వామి విలన్ గా కనిపించారు. ఓ మెడికల్ మాఫియా గురించి ఈ సినిమా మొత్తం నడుస్తుంది. ఈ తరుణంలోనే అరవిందు స్వామిని హీరోగా రామ్ చరణ్ ఎలా కట్టడి చేస్తాడు అనేది ఈ స్టోరీ.


ఈ నేపథ్యంలోనే రకుల్ అలాగే రామ్ చరణ్ మధ్య ప్రేమ వ్యవహారం కూడా బాగా తెరకెక్కించారు దర్శకుడు సురేందర్ రెడ్డి. 2016 సంవత్సరంలో... దర్శకుడు సురేందర్ రెడ్డి, గీత ఆర్ట్స్ బ్యానర్, అల్లు అరవింద్ కాంబినేషన్లో ఈ సినిమా వచ్చింది. అయితే... మొదటి నుంచి చివరి వరకు ఈ సినిమా బ్రహ్మాండంగానే ఉంటుంది. కానీ జనాలకు పెద్దగా నచ్చలేదు. దీంతో డిజాస్టర్ గా మిగిలిపోయింది ధ్రువ.


50 కోట్లతో ఈ సినిమాను తీస్తే... 64.4 కోట్లు మాత్రమే వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి 42.5 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా 64.4 కోట్లకే ఈ సినిమా పరిమితమైంది. 50 కోట్లతో సినిమా తీస్తే కచ్చితంగా 150 కోట్లు రావాల్సి ఉండేది. అందులోనూ రామ్ చరణ్ హీరోగా చేసిన సినిమా... 64 కోట్లకే పరిమితం కావడం డిజాస్టర్ కు దారితీసింది. సినిమా బాగున్నప్పటికీ.. కలెక్షన్లు పెద్దగా రాలేదు. అదే టీవీలో ఈ సినిమాను బాగా ముందు చూశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: