- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్‌ నీల్ కలయికుల రాబోతున్న సినిమాపై రోజుకు కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వస్తోంది. అయితే ఈ నెల రెండో వారంలో జరిగే షెడ్యూల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా షూటింగ్లో జాయిన్ కానున్నాడని కొద్ది రోజుల క్రితం టాకు బయటకు వచ్చింది. తాజాగా వినిపిస్తున్న అప్డేట్ ప్రకారం ఎన్టీఆర్ పై ఓ సాంగ్ ను ప్రశాంత్ నీల్‌ ప్లాన్ చేశాడట. ఈ సాంగ్ షూటింగ్ తోనే సినిమా మొదలు కాబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు డ్రాగన్ అన్న టైటిల్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. డ్రాగన్ సినిమాని ఎన్టీఆర్ కెరియర్ లోనే అత్యుత్తమ సినిమాలలో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్‌ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకే ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్‌ చాలా టైం తీసుకున్నాడట.


ప్రశాంతి నీల్ కెరీర్ లోనే బెస్ట్ ఔట్పుట్ గా ఈ సినిమా రాబోతుంది అన్న ప్రచారం కూడా నడుస్తోంది. ఇప్పటివరకు ప్రశాంత్ నీల్‌ తీసిన అన్ని సినిమాలలోను ఇదే బెస్ట్ అవుతుందని అంచనాలు వచ్చేసాయి. కొద్దిరోజుల క్రితం ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా గురించి ప్రశాంత్ నీల్‌ మాట్లాడుతూ ఆడియన్స్ ఊహించ‌ని స్థాయిలో ఈ సినిమాను తీస్తున్నాను .. ఎన్టీఆర్ పై అభిమానంతో ఈ సినిమా చేస్తున్నాను అని పేర్కొన్న సంగతి తెలిసిందే. మొత్తానికి భారీ బడ్జెట్ తో తెర‌కెక్కుతున్న ప్రశాంత్ నీల్ - ఎన్టిఆర్ సినిమా గురించి ఏ విషయం బయటకు వచ్చినా చాలా ఆసక్తిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ - ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి బ్ర‌సూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఈ యేడాది చివ‌ర్లో రిలీజ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: