- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి రసవత్తర పరిస్థితులు కనిపిస్తున్నాయి. టాలీవుడ్ సినిమాల కలెక్షన్ల విషయంలో ముందు నుంచి చాలా సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. చాలామంది నిర్మాతలు హీరోల దగ్గర గొప్పల కోసం .. తమ బిజినెస్ కోసం ఫేక్ కలెక్షన్ల పోస్టర్లు విడుదల చేస్తున్నారన్న టాక్ ఎప్పటి నుంచో ఉంది. సినిమాకు కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చినట్టు పోస్టర్లు వదులుతున్న సినిమా కొన్నవారు .. సినిమా తీసిన నిర్మాతలు అందరూ దారుణంగా నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ల సినిమాలకి నిజంగా వసూళ్లు వస్తున్నాయా ? లేదా అభిమానులను .. హీరోలను సాటిస్ఫై చేయడానికి పోస్టర్లు పడుతున్నాయా అనే చర్చ ఎప్పటినుంచో ఉన్న సంగతి తెలిసిందే. నిజానికి .. అబద్దానికి మధ్యలో అసలు నిజం ఎవరికీ తెలియని డైలమాగా మారిపోయింది. ఈ ఫేస్ క‌లెక్ష‌న్లే మొన్న ఐటీ దాడులకు కూడా కారణమని టాలీవుడ్ లో చర్చ జరిగింది.


ప్రస్తుతం టాలీవుడ్ ఫేక్ కలెక్షన్ పోస్టర్స్ విషయం మంచి హాట్‌ టాపిక్ గా మారింది. తాజాగా సంక్రాంతికి వచ్చిన వ్యక్తి వెంకటేష్ సంక్రాంతి వస్తున్నాం డిస్ట్రిబ్యూటర్లలో పలువురు ఈ తరహా పోస్టర్లు వేయటం వల్ల ఒకవేళ నిజంగా నష్టాలు వచ్చినా అవి చెప్పుకోలేని పరిస్థితిలో తాము ఉన్నామని వాపోతున్నారు. కొందరు ఆనందం కోసం ఒకపక్క సినిమా నిర్మాతలకి .. అలాగే డిస్ట్రిబ్యూటర్లకు ఫైనల్ గా వీటివల్ల ఒక సినిమా నుంచి మరో సినిమాకి నెగెటివిటీ విపరీతంగా పెరిగిపోతుంది. అయితే భవిష్యత్తులో వీటికి ఎండ్‌ కార్డు పడబోతుందా? సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ మీట్ లో డిస్ట్రిబ్యూటర్లు చేసిన కామెంట్లే ఇందుకు ఊతం ఇస్తున్నాయా అంటే టాలీవుడ్ లో అవుననే అంటున్నారు. ఏది ఏమైనా ఈ సక్సెస్మెంట్లో పలువురు డిస్ట్రిబ్యూటర్లు సైతం ఫేక్ పోస్టర్లు వేసిన ఆ కలెక్షన్లను జనాలు నమ్మడం లేదు సరి కదా నవ్వుకుంటున్నారని కూడా కామెంట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: