సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరీర్ లో ఎన్నో బెస్ట్ సినిమాలు ఉన్నప్పటికీ ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నా బెస్ట్ మూవీ ఏదనే ప్రశ్నకు 1 నేనొక్కడినే సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది. 1 నేనొక్కడినే సినిమాలో కృతిసనన్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాకు సుకుమార్ కొత్త రకం స్క్రీన్ ప్లేను ఫాలో కాగా ఆ స్క్రీన్ ప్లే సినిమాకు ఒక విధంగా ప్లస్ అయితే మరో విధంగా మైనస్ అయిందని చెప్పవచ్చు.
 
అయితే మహేష్ బాబు సినిమాలను, కొత్త రకం సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం ఆ సినిమా ఎంతగానో నచ్చిందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. 1 నేనొక్కడినే సినిమా కలెక్షన్ల విషయంలో ఒకింత నిరాశపరిచింది. ఈ సినిమా స్క్రీన్ ప్లే విషయంలో సుకుమార్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే మాత్రం ఈ సినిమా రేంజ్ కచ్చితంగా పెరిగేదని చెప్పడంలో సందేహం అయితే అవసరం లేదు.
 
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కనీసం 4 నుంచి 5 సంవత్సరాల సమయం పడుతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. 2028 సంవత్సరం లోపు మహేష్ రాజమౌళి కాంబో మూవీ విడుదలవుతుందో లేదో చూడాల్సి ఉంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ సొంతం అయ్యాయని సమాచారం అందుతోంది.
 
మహేష్ జక్కన్న కాంబో మూవీకి సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా ఇందుకు సంబంధించి ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీ ఎక్కువ సంఖ్యలో భాషల్లో రిలీజ్ కానుండగా ఇతర భాషల్లో సైతం విడుదల కానుందని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా దాదాపుగా ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: