- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్గా దర్శకుడు జ్యోతి కృష్ణ అలాగే క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్‌ ఇండియా సినిమా హరిహర వీరమల్లు. వాస్తవంగా నాలుగు సంవత్సరాలు క్రితం ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇంకా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటూనే వస్తుంది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ మొదలుపెట్టిన బ్రో - భీమ్లా నాయక్ - వకీల్ సాబ్ సినిమాలు పవన్ కళ్యాణ్ పూర్తి చేయటం ఇవి రిలీజ్ అవటం కూడా జరిగింది. కానీ ఈ సినిమాల కంటే ముందు మొదలుపెట్టిన వీరమల్లు సినిమాను మాత్రం పవన్ ఇంకా పూర్తి చేయలేకపోతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాను మార్చి 28 రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ కొన్నిసార్లు పోస్టర్లు వేస్తూ మరియు ప్రకటిస్తున్నారు.


తాజాగా ఈ సినిమా మేకర్స్ లో ఇప్పుడు మరోసారి టెన్షన్ మొదలైనట్టు తెలుస్తోంది. రిలీజ్ డేట్ కు స‌మ‌యం దగ్గర పడుతుంది. ఇప్పుడున్న‌ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మరో నాలుగు నుంచి ఐదు రోజులు డేట్ లు ఇస్తే కానీ ఈ సినిమా షూటింగ్ పూర్తికాని పరిస్థితి. పవన్ అటు రాజకీయాల పరంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండడంతో ఫుల్ బిజీగా ఉన్నారు. పవన్ ఐదు రోజుల్లో డేట్లు ఇస్తే పవన్ పోర్ష‌న్ మొత్తం పూర్తి అయిపోతుంది. అయితే పవన్ ఈ డేట్ లో ఎప్పుడు ఇచ్చేది క్లారిటీ లేకపోవడంతో మేకర్స్ టెన్షన్ పడిపోతున్నారట. అవి ఇస్తేనే సినిమాను అనుకున్నట్టుగా మార్చి 28న రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది లేకపోతే సినిమాని మళ్లీ వాయిదా తప్ప పరిస్థితి. స‌మ్మ‌ర్ లో సినిమా ను రిలీజ్ చేస్తే మంచి జిజినెస్ జ‌రుగుతంద‌న్న దే నిర్మాత‌ల ఆశ‌. మ‌రి ప‌వ‌న్ ఏం చేస్తాడో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: