టాలీవుడ్ లో గత 15 సంవత్సరాలుగా పెద్ద హీరోలు పెద్దదర్శకులు .. పెద్ద నిర్మాతలు ఇలా పెద్దపెద్ద కాంబినేషన్లో చూసుకుంటూ సినిమాలు నిర్మించారు. పెద్ద సినిమాలు - పెద్ద కాంబినేషన్లు చూపించి సినిమాలు అమ్ముకుని క్యాష్ చేసుకోవడం నిర్మాతలకు .. డిస్ట్రిబ్యూటర్లకు ఇప్పటివరకు ఒక వరంలా మారింది. ఎన్నిసార్లు ఎదురు దెబ్బలు తగిలినా కూడా నిర్మాతలు తమ తీరు మార్చుకోవటం లేదు. పెద్ద హీరోలు .. పెద్ద దర్శకులు అంటూ కథథ లేకుండా కాంబినేషన్లు నమ్ముకుని సినిమాలు చేస్తున్నారు. అయితే మరోసారి కాంబినేషన్లో నమ్ముకోవడం కంటే .. కథలు నమ్ముకుంటే మంచిదని సంక్రాంతికి వచ్చిన సినిమాలు రుజువు చేశాయి. ఆగ్ర నిర్మాత దిల్ రాజు బ్యానర్ లోనే రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా గేమ్ ఛేంజర్ సినిమాతో పాటు అనిల్ రావిపూడి - వెంకటేష్ కాంబినేషన్లో తెరకెక్కిన లో బడ్జెట్ సినిమా సంక్రాంతి వస్తున్నాం రిలీజ్ అయ్యాయి.
ఈ రెండు సినిమాలలో సంక్రాంతి వస్తున్నాం ఒక రీజనల్ సినిమా అయినా కూడా పాన్ ఇండియా రేంజ్ లో వసూళ్లు రాబట్టింది. అదే గేమ్ ఛేంజర్ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. వాస్తవానికి దిల్ రాజు తన దృష్టి అంతా గేమ్ ఛేంజర్ సినిమా మీద పెట్టారు. సంక్రాంతి వస్తున్నాం సినిమాను అసలు పట్టించుకోలేదు.. కానీ సీన్ రివర్స్ అయింది. గేమ్ ఛేంజర్ పట్టయ్యి .. సంక్రాంతికి వస్తున్నాం హిట్టయింది. ఈ ఫలితాలు దిల్ రాజుకి గొప్ప పాఠాలు ఇకపై అయినా బడ్జెట్ ని కాంబినేషన్ చూసి సినిమాలు తీయకూడదు .. కథనే నమ్ముకోవాలన్న సత్యాన్ని చెప్పిన సినిమాలు ఇవి. అందుకే దిల్ రాజు మళ్ళీ తన సినిమాలపై రివ్యూ చేసుకుంటున్నారట. కొంత కాలం పాటు పెద్ద సినిమాలకు పెద్ద హీరోలకు దూరంగా ఉండాలని మీడియం రేంజ్ సినిమాలు తీయాలన్న ఆలోచనకు వచ్చారని .. కథ బలం ఉన్న సినిమాలు చేయాలన్న నిర్ణయానికి ఆయన వచ్చారని ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఆ మాటకు వస్తే ఆయన ఒక్కరే కాదు పలువురు నిర్మాతలు కూడా ఇదే ఆలోచనలో ఉన్నారట.