గేమ్ ఛేంజర్ తో రామ్ చరణ్ ఓ డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు . అయితే ఇలా బ్యాక్ టు బ్యాక్ రామ్ చరణ్ పేరు సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురవుతూనే ఉంది. మరీ ముఖ్యంగా రామ్ చరణ్ కి అల్లు అర్జున్ కి అస్సలు పడడం లేదు అంటూ ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది. ఇప్పుడు సోషల్ మీడియాలో రామ్ చరణ్ మరొక యంగ్ హీరోతో వైర్యం పెంచుకుంటున్నాడు అంటూ జనాలు మాట్లాడుకుంటూ ట్రెండ్ చేస్తున్నారు. జనాలు అదేవిధంగా మాట్లాడుకుంటున్నారు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆ యంగ్ హీరో సినిమాకి చూస్ చేసుకున్న టైటిల్ ని ఇప్పుడు రామ్ చరణ్ - బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కే మూవీ కి వాడుకుంటున్నారట .
ఆల్రెడీ ఈ యంగ్ హీరో టైటిల్ పై అన్ని హక్కులు కొనుగోలు కూడా చేసే విధంగా రెడీగా పెట్టుకున్నారట . కానీ రామ్ చరణ్ ఆ టైటిల్ బాగుండడంతో తన బ్యాక్ గ్రౌండ్ ఉపయోగించి ఆ టైటిల్ ఆ హీరోకి దక్కనివ్వకుండా బ్యాక్ గ్రౌండ్ లో జిమ్మిక్కులు చేసి బుచ్చిబాబు సనాకి ఆ టైటిల్ వచ్చేలా మార్చేసారట . త్వరలోనే టైటిల్ అనున్స్ చేయబోతున్నారట . దీంతో రామ్ చరణ్ పేరు సోషల్ మీడియాలో మరొకసారి వైరల్ గా మారింది. మొదట అల్లు అర్జున్ తో గొడవలు ఇప్పుడు యంగ్ హీరోతోనా..? ఏంటి నీ ప్రాబ్లం బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఏమైనా చేస్తే చూస్తూ ఊరుకుంటారా..? అంటూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు . మరికొందరు మాత్రం రామ్ చరణ్ మనస్తత్వం అలాంటిది కాదు ఏదో బ్యాక్ గ్రౌండ్ లో కన్నింగ్ ప్లాన్స్ వేస్తున్నారు అంటూ రాంచరణ్ కి సపోర్టివ్ గా మాట్లాడుతున్నారు. మొత్తానికి రాంచరణ్ పేరు సోషల్ మీడియాలో మరోకసారి ట్రీల్లింగ్ కి గురవుతుంది..!