టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రతి సంవత్సరం చాలా మంది దర్శకులు ఎంట్రీ ఇస్తున్నారు. కానీ అందులో కొంత మంది మాత్రమే అద్భుతమైన స్థాయిలో సక్సెస్ను అందుకుంటున్నారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన స్థాయిలో సక్సెస్ను అందుకున్న వారిలో సందీప్ రెడ్డి వంగ ఒకరు. ఈయన కొంత కాలం క్రితం విజయ్ దేవరకొండ హీరో గా శాలిని పాండే హీరోయిన్గా అర్జున్ రెడ్డి అనే మూవీ ని రూపొందించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

సినిమా ద్వారా సందీప్ రెడ్డి వంగ కు దర్శకుడిగా అదిరిపోయే రేంజ్ గుర్తింపు లభించింది. ఈ మూవీ తర్వాత ఈయన హిందీ లో అర్జున్ రెడ్డి మూవీ ని కబీర్ సింగ్ పేరుతో రీమిక్ చేయగా ... ఆ సినిమా అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే కొంత కాలం క్రితం ఈయన యానిమల్ అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దీనితో ఈయనకు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇకపోతే సందీప్ రెడ్డి వంగ "అర్జున్ రెడ్డి" అనే మూవీ తో దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించిన ఈయన అంతకు ముందు కూడా కొన్ని సినిమాలకు పని చేసాడు .

మరి సందీప్ రెడ్డి వంగ "అర్జున్ రెడ్డి" మూవీ కి దర్శకత్వం వహించడం కంటే ముందు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా రూపొందిన కేడి అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కేడీ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన సందీప్ ఆ తర్వాత అర్జున్ రెడ్డి మూవీ కి దర్శకత్వం వహించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Srv