కోలీవుడ్ నటుడు విశాల్ తాజాగా మద గజ రాజ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను 2012 వ సంవత్సరం మొదలు పెట్టారు. ఆ తర్వాత కొంత కాలానికే ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది. కానీ ఈ సినిమాను కొన్ని కారణాల వల్ల విడుదల చేయలేదు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఈ మూవీ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇకపోతే ఈ మూవీ ని ఈ సంవత్సరం పొంగల్ కానుకగా మొదటగా తమిళ భాషలో విడుదల చేశారు. ఇక తమిళ బాక్సా ఫీస్ దగ్గర ఈ మూవీ మంచి ఇంపాక్ట్ ను చూపించింది.

దానితో ఈ మూవీ కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను  వసూలు చేసే మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తమిళ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో ఈ మూవీ ని జనవరి 31 వ తేదీన తెలుగు భాషలో కూడా విడుదల చేశారు. తమిళ్ లో ఈ మూవీ కి మంచి కలెక్షన్లు రావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కి మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. ఈ మూవీ కి తెలుగు రాష్ట్రాల్లో 2.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ మూవీ శుక్రవారం విడుదల కాగా శనివారం రోజు పెద్ద స్థాయిలో కలెక్షన్లను వసూలు చేయడంలో విఫలం అయినట్లు తెలుస్తుంది. రెండు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో 40 లక్షల షేర్ ... 75 లక్షల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా ఈ మూవీ మొదటి వెక్ డే ను బాక్స్ ఆఫీస్ దగ్గర యూస్ చేసుకోవడంలో కాస్త విఫలం అయింది అని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: