బాలయ్య టాప్3 హీరోయిన్ల జాబితాలో విజయశాంతి, రమ్యకృష్ణ, సిమ్రాన్ ఉన్నారు. ఈ ముగ్గురు హీరోయిన్లు బాలయ్యకు కెరీర్ బెస్ట్ హిట్లను ఇచ్చారని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఈ రీజన్ వల్లే బాలయ్య ఈ ముగ్గురు హీరోయిన్ల పేర్లను చెప్పారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బాలయ్య పారితోషికం కూడా ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.
బాలయ్య తర్వాత సినిమాలపై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా లుక్స్ విషయంలో కేర్ తీసుకుంటున్న ఈ హీరో తర్వాత ప్రాజెక్ట్స్ తో సంచలనాలు సృష్టించడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య భిన్నమైన ప్రాజెక్ట్స్ కు ఓటు వేస్తుండగా ప్రగ్యా జైస్వాల్ బాలయ్య సినిమాలలో హీరోయిన్ గా నటిస్తుండటం గమనార్హం.
బాలయ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు. బాలయ్య సినిమాల బడ్జెట్ కూడా 100 కోట్ల రూపాయల కంటే పెరిగిందనే సంగతి తెలిసిందే. బాలయ్య సక్సెస్ ఫుల్ డైరెక్టర్లకు, యంగ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడం ద్వారా మార్కెట్ ను పెంచుకుంటున్నారు. బాలయ్య పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకుని రికార్డ్స్ క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బాలయ్య సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తే ఫ్యాన్స్ ఆనందానికి సైతం అవధులు ఉండవని చెప్పవచ్చు.సినిమా సినిమాకు బాలయ్య రేంజ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది.