విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14 వ తేదీన విడుదల అయ్యి అద్భుతమైన స్థాయిలో బాక్సా ఫీస్ దగ్గర కలెక్షన్లను రాబడుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సినిమా విడుదల అయ్యి 19 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఇక 19 వ రోజు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచ కోత కోసింది. 19 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో సంక్రాంతికి వస్తున్నాం సినిమా అద్భుతమైన స్థానంలో నిలిచింది. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోలుగా రూపొందిన సినిమాల రికార్డ్ లనే లేపేసి కొత్త రికార్డును సృష్టించింది. మరి విడుదల అయిన 19 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలు లిస్టులో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏ స్థానంలో నిలిచింది అనే వివరాలను తెలుసుకుందాం.

విడుదల అయిన 19 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలు లిస్టులో బాహుబలి 2 సినిమా 2.18 కోట్ల కలెక్షన్లతో మొదటి స్థానంలో కొనసాగుతూ ఉండగా , బాహుబలి పార్ట్ 1 మూవీ 1.80 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానంలో కొనసాగుతుంది. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా 1.59 కోట్లతో మూడవ స్థానంలో నిలవగా , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన అత్తారింటికి దారేది సినిమా 1.35 కోట్ల కలెక్షన్లతో 4 వ స్థానంలోనూ , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ 1.35 కోట్ల కలెక్షన్లతో 5 వ స్థానంలో నిలిచింది. ఇకపోతే సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా ... అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: