అయితే వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదు. అల్లు అర్జున్ కాలు స్లిప్ అయ్యిందని అందుకే బన్నీ ఈ ఈవెంట్ కు హాజరు కాలేదని సమాచారం అందుతోంది. వైరల్ అవుతున్న వార్తలు సోషల్ మీడియా వేదికగా ప్రచారంలోకి వస్తే ఈ నెగిటివ్ ప్రచారానికి అడ్డుకట్ట పడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. వాస్తవానికి బన్నీ ఈ ఈవెంట్ కు హాజరవుతారని మేకర్స్ జోరుగా ప్రచారం చేశారు.
సొంత బ్యానర్ సినిమా కావడంతో బన్నీ సైతం ఈ ఈవెంట్ కు హాజరు కావడానికి ఆసక్తి చూపారు. ఇన్ హౌస్ ఈవెంట్ కావడంతో ఈ సినిమా ఈవెంట్ కు సెక్యూరిటీ పరంగా కూడా సమస్యలు లేవు. వాస్తవానికి సాయిపల్లవి ఆరోగ్యం బాలేకపోయినా ఆమె ఈ ఈవెంట్ కు హాజరైన సంగతి తెలిసిందే. తండేల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని ఇప్పటికే అల్లు అరవింద్ తన రివ్యూ ఇచ్చేశారు.
ఈ సినిమాను చాలా ఏరియాల్లో గీతా ఆర్ట్స్ నిర్మాతలు సొంతంగా రిలీజ్ చేస్తున్నారు. చందూ మొండేటి కార్తికేయ2 తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా కావడం కూడా ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమైందని చెప్పవచ్చు. గీతా ఆర్ట్స్ బ్యానర్ భవిష్యత్తును తండేల్ మూవీ డిసైడ్ చేయనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీకి 2025 సంవత్సరం కలిసిరావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తండేల్ కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందేమో చూడాల్సి ఉంది.