తండేల్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి డైరెక్టర్ సందీప్ రెడ్డివంగ గెస్ట్ గా వచ్చారు. అక్కడ పలు విషయాలను కూడా తెలియజేయడమే కాకుండా ఎన్నో తెలియని విషయాలను కూడా తెలిపారు. నాగచైతన్య కూడా తన భార్య శోభితా గురించి మాట్లాడుతూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను తెలిపారు.. ఇంట్లో శోభితాను బుజ్జి తల్లి అని పిలుస్తూ ఉంటానని.. ఈ సినిమాలో హీరోయిన్ ని కూడా అలాగే పిలుస్తూ ఉంటానని వెల్లడించారు.
సమంతతో విడాకుల అనంతరం శోభితతో ప్రేమాయణం నడిపిన నాగచైతన్య కొన్ని నెలలు డేటింగ్ చేసి మరి గత ఏడాది వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి వెకేషన్ కి వెళ్ళిన కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. గత ఏడాది డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో వీరి వివాహం జరిగింది .ఇక అప్పటినుంచి వీరి గురించి నిత్యం ఏదో ఒక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. వివాహమైన అనంతరం నాగచైతన్య నటిస్తున్న సినిమా కావడం చేత ఈ సినిమా పైన అంచనాలు భారీగానే పెరిగిపోయాయి. మరి నాగచైతన్య సినీ కెరియర్ లోని అత్యధికంగా కలెక్షన్స్ రాబట్టే చిత్రంగా తండేల్ నిలుస్తుందనీ చిత్ర బృందం భావిస్తోంది మరి అది ఎంతవరకు సాధ్యమో చూడాలి మరి.