మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బింబిసార ఫేమ్ మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సోషియో ఫాంటసీ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శర వేగంగా జరుగుతుంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ ని ఈ సంవత్సరం మే 9 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తర్వాత చిరంజీవి , అనిల్ రావిపూడి దర్శకత్వంలో మూవీ చేయబోతున్నాడు.

ఇప్పటికే అనిల్ రావిపూడి తన నెక్స్ట్ మూవీ ని చిరంజీవి తో చేయబోతున్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లోనే విడుదల కాబోతున్నట్లు కూడా తెలియజేశారు. ఇకపోతే అనిల్ రావిపూడి "పటాస్" అనే మూవీ తో దర్శకుడి గా కెరియర్ ను మొదలు పెట్టి ఆ తర్వాత సుప్రీమ్ , రాజా ది గ్రేట్ , ఎఫ్ 2 , సరిలేరు నీకెవ్వరు , ఎఫ్ 3 , భగవంత్ కేసరి , సంక్రాంతికి వస్తున్నాం అనే 8 సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఈ ఎనిమిది మూవీ లు కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. దానితో ఈయనకు దర్శకుడిగా సూపర్ సాలిడ్ క్రేజ్ ఉంది. ఇకపోతే అనిల్ రావిపూడి కెరియర్ బిగినింగ్ నుండి కూడా ఎంత సీరియస్ కంటెంట్ అయిన కామెడీ ప్రధానంగా చూపిస్తూ రావడంలో స్పెషలిస్ట్ అలాంటి వే లోనే ఆయన అద్భుతమైన విజయాలను అందుకున్నాడు.

ఇక ఆయన కెరీర్ లో కేవలం భగవంత్ కేసరి సినిమా మాత్రమే కామెడీ కి దూరంగా ఉంటూ సీరియస్ స్క్రీన్ ప్లే తో వెళుతూ ఉంటుంది. దానితో చిరంజీవి సినిమాతో కూడా అలాంటి ప్రయోగం ఏదైనా అనిల్ రావిపూడి చేస్తాడేమో అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆయన తాజా ఇంటర్వ్యూలో భాగంగా చిరంజీవి తో తాను చేయబోయే సినిమా అదిరిపోయే రేంజ్ కామెడీ ఓరియంటెడ్ గా ఉండబోతున్నట్లు , చిరంజీవి ఓల్డ్ సినిమాల మాదిరి అందులో కామెడీ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకొని ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: