నందమూరి బాలకృష్ణ తన కెరీర్లో ఇప్పటికే 109 సినిమాలలో నటించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించే అఖండ 2 తాండవం సినిమా బాలయ్య కెరీర్ లో 110 సినిమా అవుతుంది. ఇన్నేళ్ల తన కెరీర్లో బాలయ్య ఎంతోమంది హీరోలతో నటించారు .. ఇంకా నటిస్తూనే ఉన్నారు. మరి ఇంతమంది హీరోయిన్లలో బాలయ్యకు బాగా నచ్చి .. బాలయ్య మెచ్చిన హీరోయిన్లు ఎవరో ? తాజాగా బయటికి వచ్చింది. ఈ ప్రశ్నకు బాలయ్య సమాధానం చెబుతూ తన కెరీర్ మొత్తం మీద తనకు బాగా నచ్చిన హీరోయిన్లు ఎవరో ? చెప్పుకోవచ్చారు. బాలకృష్ణ తన నటించిన హీరోయిన్లలో బాలకృష్ణ బాగా నచ్చిన హీరోయిన్ విజయశాంతి.
లేడీ అమితాబచ్చన్ విజయశాంతి .. బాలయ్యది ఒకప్పుడు హిట్ కామినేషన్. అయితే వీరిద్దరికీ మధ్య అంతకుమించిన అనుబంధం ఉంది. అందుకే తన టాప్ హీరోయిన్ల లిస్టులో మొదటి స్థానం విజయశాంతిదే అని చెప్పేశారు బాలయ్య బాబు. ఇక విజయశాంతి తర్వాత రమ్యకృష్ణ అంటే తనకు చాలా ఇష్టం అని బాలయ్య చెప్పారు. బాలకృష్ణ రమ్యకృష్ణ అది కూడా సక్సెస్ఫుల్ కాంబినేషన్ .. వీరిద్దరి కాంబినేషన్ లేకుండా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అంతకుమించి వీరిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది.
ఇక బాలయ్యకు బాగా నచ్చిన హీరోయిన్లలో టాప్ త్రీ లో మూడో స్థానంలో సిమ్రాన్ ఉన్నారు. సిమ్రాన్ - బాలయ్య కాంబినేషన్లో సమరసింహారెడ్డి - నరసింహనాయుడు లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలు వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో అఖండ - ఢాకు మహారాజు లాంటి హిట్ సినిమాలలో ప్రగ్య జైశ్వాల్ వరుసగా నటించారు. అలాగే అఖండ 2 లో కూడా ఆమె హీరోయిన్గా ఎంపికైనట్టు ప్రచారం జరుగుతోంది. మరి ప్రగ్యా జైస్వాల్ పేరు బాలయ్య ఎందుకు చెప్పలేదు అనుకుంటే బహుశా ఆమెకు ఖచ్చితంగా టాప్ టెన్ లో అవకాశం ఇస్తారని అంటున్నారు.