నట‌సింహం నందమూరి బాలకృష్ణ కి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించడంతో నందమూరి అభిమానులు ఊహించిన రేంజ్ లో సంబరాలు చేసుకుంటున్నారు .. చిత్ర పరిశ్రమకు , ప్రజలకు , రాజకీయ నాయకుడిగా ఆయన చేసిన సేవలు , బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఆయన ఉచితంగా అందిస్తున్న వైద్యానికి ప్రత్యేకగా ఈ అవార్డు ఆయనకు ఎప్పుడో రావాల్సింది .. కానీ ఎంతో ఆలస్యంగా వచ్చిందని అభిమానులు అంటున్నారు .. అలాగే బాలకృష్ణకు టాలీవుడ్ నుంచి రాజకీయ ప్ర‌ముకుల నూంచి ఇలా  అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.. అయితే ఇదంతా పక్కన పెడితే బాలకృష్ణ సోదరి చంద్రబాబు భార్య నారా . భువనేశ్వరి గారు మాత్రం తన అన్న‌య్య‌కి ఎంతో ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా భారీ పార్టీని కూడా ఏర్పాటు చేసింది.
 

ఇక తన సొంత డ‌బ్యులతో ఏర్పాటు చేసిన ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఏపీ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథులుగా వచ్చా రు.. అదేవిధంగా చిత్ర పరిశ్రమ నుంచి కొందరు హీరోలు , దర్శకులు , నిర్మాతలు కూడా ఈ పార్టీలో పాల్గొని బాలయ్య గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు .. అయితే ఈ పార్టీలో ప్రధానంగా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడిన‌ మాటలు సోషల్ మీడియాలో ఎంతో ఆ టాపిక్ గా మారాయి .. ఈ పార్టీలో చంద్రబాబు మాట్లాడుతూ అల్లరి బాలకృష్ణ కస్తా ఇప్పుడు పద్మ విభూషుడిగా మారిపోయాడు .. సినీ నటుడుగా 50 సంవత్సరాల నుంచి నెంబర్ వన్ హీరోగా కొనసాగుతూ ఎన్నో అద్భుతమైన పాత్రలో నటించి మెప్పించాడు .. అలాగే ఒకరకంగా చెప్పాలంటే బాలయ్య నాకంటే సీనియర్ నేను 1978లో ఎమ్మెల్యేగా గెలిచా.. బాలయ్య 1974లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

 

అలాగే బాలయ్య గురించి చంద్రబాబు ఇంకా మాట్లాడుతూ నటరత్న ఎన్టీఆర్ గారిలో ఉన్న ప్రతిభా , పట్టుదల కృషి ఇవన్నీ బాలయ్యలో చూసుకోవచ్చు .. చూస్తానికి ఎంతో చిలిపిగా కనిపిస్తాడు కానీ ఆయనలో ఎంతో లోతైన కృషి పట్టుదల కనిపిస్తాయి .. ఇప్పుడు ఆయన్ని ఈ స్థాయిలో నిలబెట్టాయి .. కేవలం ఒక సినీ నటుడుగా మాత్రమే కాదు .. మంచి మనసున్న వ్యక్తి కూడా బాలయ్య .. ప్రజలకు ఏదో ఒక మంచి చేయాలని ఆలోచనతో ఆయన బసవతారకం క్యాన్సల్ హ‌స్పటల్ని ఇప్పటికీ ఆశయంతో నడిపిస్తున్నాడు .. అలాగే రాజకీయాల్లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు మూడుసార్లు కాదు ఎన్నిసార్లు అయినా ఆయన ఒక్కడే అక్కడా ఎమ్మెల్యే .. ఒక్కొక్కసారి తన భార్య వసుంధరకి ఎమ్మెల్యే టికెట్ అడుగుతూ ఉంటాడు అంటూ చంద్రబాబు బాలకృష్ణ పై సెటైర్‌ వేశాడు .. ఆ సమ‌యంలో బాలయ్య మా ఇద్దరికీ ఇచ్చేయండి అనగా అలా ఇవ్వను కుటుంబానికి ఒక్కరే ఎమ్మెల్యే టికెట్ అంటూ చంద్రబాబు సరదాగా మాట్లాడిన మాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .. దీన్నిబట్టి వచ్చే ఎన్నికల్లో హిందూపూర్లో బాలయ్య భార్య వసుంధర ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. మరి 2029 ఎన్నికల్లో బాలయ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: