టాలీవుడ్ హీరో, మా చీఫ్ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కనున్న సినిమా కన్నప్ప. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో తెరక్కిస్తున్నారు. ప్రభాస్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, మోహన లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, మధుబాల లాంటి ఎంతోమంది స్టార్ నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. కన్నప్ప సినిమా ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి దాదాపుగా ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. 

మంచు విష్ణు, మోహన్ బాబు, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ ఇలా ప్రతి ఒక్కరి పోస్టర్లను చిత్ర బృందం విడుదల చేసింది. అక్షయ్ కుమార్ ఈ సినిమాలో శివుడి పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే అతని లుక్ ను రివిల్ చేయగా ప్రేక్షకులలో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రభాస్ ఈ సినిమాలో ఏ పాత్రలో నటిస్తున్నారు అనే దానిపైన ఇంతవరకు క్లారిటీ రాలేదు.

మొదట శివుడి పాత్రలో అంటూ అనేక రకాల మాటలు వచ్చాయి. కాగా ఆ పాత్రలో అక్షయ్ కుమార్ నటించబోతున్నట్టుగా తెలిసిపోయింది. ఈ నేపథ్యంలోనే కన్నప్ప నుంచి ప్రభాస్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ ఫోటోలో ప్రభాస్ రుద్ర పాత్రలో కనిపించారు. దీంతో ప్రభాస్ లుక్ అదిరిపోయిందంటూ అభిమానులు పోస్టులు కామెంట్లు చేస్తున్నారు.

సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా ప్రస్తుతం ప్రభాస్ ది రాజా సాబ్, స్పిరిట్, కన్నప్ప వంటి సినిమాలలో నటిస్తున్నారు. ఈ మూడు సినిమాల షూటింగ్ లలో ప్రస్తుతం ప్రభాస్ బిజీగా ఉన్నారు. బాహుబలి సినిమా నుంచి ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే కావడం గమనార్హం. కాగా ప్రభాస్ ప్రతి సంవత్సరం ఏదో ఒక సినిమాతో అభిమానులకు చేరువలో ఉంటూ ఉంటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: