ప్రీతి కెరియర్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో ఆమె వ్యక్తిగత జీవితం కూడా అదే స్థాయిలో వైరల్ అయితూ వచ్చింది .. ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈమె తీసుకున్న కొన్ని నిర్ణయాలతో ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ వచ్చేది .. 2009లో ప్రీతి 34 మంది చిన్నపిల్లలను దత్తత తీసుకోవడం అప్పట్లో అందర్నీ షాక్ గురిచేసింది .. ఇప్పటివరకు ఆ ఆడపిల్లల పెంపకానికి పోషణకి అయ్యే ఖర్చులన్నీ ఆమె భరిస్తుంది .. అలాగే సామాజిక సేవల్లో ఈమె ఎప్పుడు ఎంతో ముందు ఉంటుంది .. మహిళలపై అత్యాచారం వంటి నేరాలుకో పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ కూడా చేస్తుంది. అంతేకాకుండా 2001 చిత్రం ‘చోరీ చోరీ చుప్కే చుప్కే’ షూటింగ్ సమయంలో తనకు 50 లక్షల రూపాయలు కావాలని ఫోన్ కాల్స్ వచ్చాయి అనే విషయాన్ని కోర్టుకు చెప్పుకొచ్చింది ప్రీతి ..
ఇక ఆ సమయంలో గ్యాంగ్‌స్టర్లకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినప్పుడు ఆమె ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొంది .. ఆమె ధైర్యానికి అప్పటి హోం మంత్రి ఎల్‌కె అద్వానీచే ‘గాడ్‌ఫ్రే ఫిలిప్స్ నేషనల్ బ్రూవరీ అవార్డు’తో ఆమెని గొప్పగా సత్కరించారు .. ఇలా ఆమె అడుగుపెట్టిన ప్రతిచోట ఎన్నో ప్రశంసలు అందుకుంది .. అయితే ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ , రాణి ముఖర్జీతో పాటు ప్రీతి జింత కూడా నటించింది .. అబ్బాస్-మస్తాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు .. అలాగే ఆ సమయంలో సిబిఐ దాడులు జరగటం కారణంగా ఈ సినిమా రిలీజ్ కు ఆలస్యం అవుతూ వచ్చింది. ప్రస్తుతం ప్రీతీ సినిమాలకు దూరంగా ఉంటుంది .. ఇక మరి రాబోయే రోజుల్లో ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలు పెడుతుందో లేదో చూడాలి. ఇప్పటికే చాలామంది సీనియర్ హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి దూసుకుపోతున్నారు.. ప్రీతి కూడా బాలీవుడ్ లో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాలని ఆమె అభిమానులు ఆశపడుతున్నారు.