టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన కీర్తి సురేష్ సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్లను సొంతం చేసుకుంటున్న హీరోయిన్లలో ఒకరనే సంగతి తెలిసిందే. టైర్2 హీరోలకు జోడీగా ఎక్కువ సినిమాలలో నటించిన కీర్తి సురేష్ టైర్1 హీరోలకు ఎక్కువగా నటించలేదనే సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీ అవుతున్నారు.
 
కీర్తి సురేష్ రెమ్యునరేషన్ 2 నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ కథ నచ్చితే గ్లామరస్ రోల్స్ లో నటించడానికి సైతం ఇష్టపడుతున్నారు. కీర్తి సురేష్ లుక్స్ విషయంలో సైతం ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కీర్తి సురేష్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వగా బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఆమెకు ఆశించిన ఫలితాలు అయితే రాలేదనే సంగతి తెలిసిందే.
 
కీర్తి సురేష్ మలయాళ నటుడు దిలీప్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక సినిమాలో దిలీప్ కు తాను కూతురిగా నటించానని ఆ సమయంలో దిలీప్ ను అంకుల్ అని పిలిచేదానినని కీర్తి సురేష్ చెప్పుకొచ్చారు. తర్వాత రోజుల్లో దిలీప్ కు తాను జోడీగా నటించాల్సి వచ్చిందని అమె పేర్కొన్నారు. ఆ సమయంలో అంకుల్ అని పిలవొద్దని చెబితే అన్నయ్య అని పిలిచానని కీర్తి సురేష్ వెల్లడించారు.
 
కీర్తి సురేష్ ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. కీర్తి సురేష్ కు సోషల్ మీడియాలో ఏకంగా రికార్డ్ స్థాయిలో ఫాలోవర్లు ఉన్నారు. కీర్తి సురేష్ తెలుగు, తమిళ సినిమాలతో పాటు మలయాళ సినిమాలలో సైతం నటించారు. పెళ్లి తర్వాత కూడా బోల్డ్ అండ్ ట్రెడిషనల్ రోల్స్ లో నటించడం ద్వారా కీర్తి సురేష్ సత్తా చాటుతున్నారు.2025 సంవత్సరం ఈ బ్యూటీకి ఏ రేంజ్ లో కలిసొస్తుందో చూడాల్సి ఉంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: