పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఈశ్వర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి బాహుబలి సినిమాలతో ఇండియన్ చిత్ర పరిశ్రమను షేక్‌ చేశాడు .. ఇప్పటికీ ప్రభాస్ సినిమాలు వస్తున్నాయంటే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అందరూ హీరోలు పక్కకు వెళ్లి పోవాల్సిందే .. ఇప్పటికే సలార్ , క‌ల్కి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా విజయాలను తన ఖాతాలో వేసుకొని ఫుల్ ఫామ్ లో వరస సినిమాలు చేసుకుంటూ వచ్చేస్తున్నాడు .. ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు .. వాటిలో సలార్ 2 , కల్కి2 సినిమాలు కూడా ఉన్నాయి .. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్, ఫౌజి సినిమాలను కంప్లీట్ చేస్తున్నాడు ..


ఇక ఇప్పుడు వచ్చే సమ్మర్లో రాజా సాబ్ తో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు .. ఆ తర్వాత ఈ ఇయర్ ఎండింగ్లో ఫౌజి సినిమాతో మరోసారి బాక్సాఫీస్ ముందుకు వస్తాడు .. ఇలా వరుసగా సంవత్సరానికి రెండు సినిమాలతో బాక్సాఫీస్ ముందుకు వస్తు పాన్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్‌ చేయడానికి రెడీగా ఉన్నాడు. అయితే ఇదే క్రమంలో ప్ర‌భ‌స్‌ నటించబోయే సలార్ 2 సినిమాని కూడా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు .. అయితే ఇప్పుడు చాలా ఈ  సినిమాలో పృధ్విరాజ్ సుకుమారన్  ప్రభాస్ ని భారీగా వెన్నుపోటు పడకపోతున్నాడని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .. నిజానికి శౌర్యంగా పర్వం పేరుతో స‌లార్ 2 రాబోతుంది .. ఈ సలార్ 2 లో పృధ్విరాజ్ సుకుమారన్  , ప్రభాస్ కి మధ్య భారీ యుద్దమే జరగనుంది ..


ఇక ఇందులో భాగంగానే తన ప్రాణ స్నేహితుడిగా ప్రభాస్ ను నమ్మించి ఆ తర్వాత వెన్నుపోటు పొడిచే బాహుబలిలో కట్టప్ప సన్నివేశం లాగానే భారీ సిన్‌ను కూడా ఈ సినిమాలో ఉండబోతుందట. అయితే ఏదేమైనా కూడా ప్రభాస్ ఈ సినిమాలో మరోసారి తన యాక్షన్ తో మరో ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడని చెప్పాలి .. ఇక సలార్‌ సినిమా కూడా 700 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది .. ఇక ఇప్పుడు సలార్ 2 సినిమాతో పుష్ప2 కలెక్షల  రికార్డు బ్రేక్ చేయడం కూడా ఖాయమని అభిమానులు అంటున్నారు. ఇక మరి ప్రశాంత్ నీల్‌ కూడా సలార్ 2ను భారీగానే ప్లాన్ చేస్తానని కూడా హింట్ ఇస్తూ వస్తున్నాడు .. ప్రభాస్ , ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ ఎలాంటి సంచలనాలు ఉంచుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: