ఇండస్ట్రీలో ఎంతోమంది అమ్మాయిలు స్టార్ స్టేటస్ ని అందుకొని సక్సెస్ అవ్వాలని కలలు కంటూ వస్తూ ఉంటారు. అయితే ఇందులో కొంతమంది మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీగా పేరుపొందిన వారిలో ముమైత్ ఖాన్ కూడా ఒకరు.. హీరోయిన్గా అవ్వాలని ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఇమే కెరియర్ ప్రారంభంలోనే ఐటెం గర్ల్ గా పలు పాటలు నటించి భారీ పాపులారిటీ సంపాదించుకుంది. అదే తరహా పాటలు చేస్తూ క్రేజీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ స్టార్ హీరోలు అందరి చిత్రాలలో కూడా ఆడి పాడింది.


ముమైత్ ఖాన్ కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ్ వంటి భాషలలో కూడా అలరించింది. బాలీవుడ్ వైపుగా అడుగులు వేసి అక్కడ భారీ క్రేజ్ రావడంతో అక్కడే ఉండిపోయింది. బెంగాల్ , ఒడియా వంటి భాషలలో కూడా తన డాన్స్ తో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇటీవలే ఈ హాట్ బ్యూటీ తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఇటీవలే ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ పలు విషయాలను తెలియజేసిందట.

తనకు మేజర్ యాక్సిడెంట్ కావడం చేత కొంతకాలం తాను ఇంటికి పరిమితమయ్యానని ప్రస్తుతం ఇప్పుడు కోరుకుంటున్నానని అవకాశాలు వస్తున్నప్పటికీ తాను మాత్రం ఎక్కువగా బిజినెస్ ప్లాన్ లోనే ఉన్నానని తెలిపింది. ఈ విషయంలో తనకు కొంతమంది సపోర్ట్ ఉంది అందుకే ముందడుగు వేశానని తెలిపింది. అలాగే పెళ్లి ప్రస్తావన రాగ తాను ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదని వెల్లడించింది.. డేటింగ్ విషయం పైన మాట్లాడుతూ తను నలుగురితో డేటింగ్ చేశాను ఎవరితో వర్కౌట్ కాలేదని తెలిపింది. ఆ నలుగురితో కూడా చాలా జెన్యూన్ గానే ఉండేదాన్ని ఎందుకు సెట్ అవ్వలేదని తెలిపింది.. బ్రేకప్ అయినప్పటికీ కూడా చాలామంది వాటి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు.. కానీ ఏది రాసి ఉంటే అది అలా జరుగుతుందని నమ్ముతానని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: