మన టాలీవుడ్ సీనియర్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి అభిమాని అవని వ్యక్తి ఎవరైనా ఉంటారా ? ఎలాంటి సపోర్టు లేకుండా చిత్ర పరిశ్రమలో స్వయంకృషితో మెగాస్టార్ చిరంజీవి నటన ప్రస్థానాన్ని చూసి ఎందరో నటులు , దర్శకులు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని తమ కెరీర్ ను కొనసాగిస్తున్నారు .. చిరంజీవి ఎలాంటి జోనర్లు అయినా కామెడీ , డ్రామా , సెంటిమెంట్ మాస్ , క్లాస్ అన్ని జోనర్ లోను తన నటనతో విశ్వరూపం చూపించి కోట్లాదిమంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్నాడు .. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు కమర్షియల్ సినిమాకి చిరంజీవికి ముందు చిరంజీవి తర్వాత అనేలా చరిత్రలో తన పేరును లిఖించుకున్నాడు.


చిరంజీవి వచ్చిన తర్వాతే తెలుగు కమర్షియల్ సినిమాలో డాన్స్ ఫైట్స్ వేగం పుంజుకున్నాయి .. చిత్ర పరిశ్రమలో ఉన్న సెలబ్రిటీలు కూడా అధికంగా చిరంజీవికి అభిమానులే .. అందులో అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ఉన్నారు .. తెలుగు దర్శకుడిగా కెరియర్ మొద‌లు పెట్టి నేడు పాన్ ఇండియా లేవ‌ల్‌లో మన తెలుగోడి సత్తాని సందీప్ రెడ్డి ఏ విధంగా చాటి చెప్పాడో అంతా చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఈ వైల్డ్ టాలెంటెడ్ దర్శకుడు చిరంజీవికి వీర‌ అభిమాని .. అయితే రీసెంట్గా సందీప్ తన ఇంస్టాగ్రామ్ లో తన ఇంటి కి సంబంధించిన ఫోటో ని షేర్ చేశాడు .. ఆ ఫోటో మొదట్లో మెగాస్టార్ చిరంజీవి ఫోటో ఫ్రేమ్ ఒకటి కనిపించింది .. ఆ తర్వాత ఆ ఇంటి లోపల వైపు చూస్తే చిన్న వయసు నుంచి అతన్ని ప్రభావితం చేసిన కొన్ని హాలీవుడ్ యాక్షన్ సినిమాల ఫోటో ఫ్రేమ్స్ కూడా కనిపించాయి ..


వాటన్నిటిలో చిరంజీవి ఫోటో ఫ్రేమ్ ఎంతో హైలెట్ అయింది .. మెగా అభిమానిగా దాన్ని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో చిరంజీవి స్థాయి ఇది అంటూ భారీ కామెంట్ కూడా ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ .. అలాగే చిరంజీవితో ఒక భారీ సినిమా చేయాలని ఉంది ఇదే తన కోరిక అని కూడా సందీప్ రెడ్డి వంగ ఎప్పుడూ చెబుతూ ఉంటాడు. ఇలాంటి వైల్డ్ డైరెక్టర్ తో చిరంజీవి సినిమా పడితే పాన్ ఇండియా బాక్సాఫీస్ తగలబడిపోతుంది. ఇక మరి ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేయబోతున్నాడు .. ఈ సినిమా తర్వాత అయినా చిరంజీవి , సందీప్ రెడ్డి వంగ సినిమా ఉంటుందా తేదో తెలియాలి.. ఇదే క్రమంలో 2029 చివర్లో చిరు , సందీప్ రెడ్డి వంగ మూవీ కచ్చితంగా ఉంటుందని అంటున్నారు .. త్వరలోనే ఈ ఇద్దరి కాంబోపై కూడా అధికార ప్రకటన రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: