అలాగే ఈ సినిమాలో నటించే నటీనటుల ఎంపిక కూడా దాదాపు పూర్తయినట్టు తెలుస్తుంది .. ఈ సినిమాలో మహేష్ కు జంటగా ఇంటర్నేషనల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుంది. మరో కొన్ని రోజులనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలుకానుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి భారీ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు కాశీకు సంబంధించి మణికర్ణిక ఘాట్ సెట్ వేయాలని ఉద్దేశంలో రాజమౌళి ఉన్నారట.. ఈ సినిమాలో పురాణాలకు సంబంధించిన రిఫరెన్స్ కూడా ఉండబోతుందని తెలుస్తుంది .. ఇందులో భాగంగానే కాశీ సెట్‌గా వేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది ..
అయితే కాశీలో షూటింగ్ చేయడానికి ఎక్కువ రోజులు పర్మిషన్ దొరకకపోవటంతో . ఇప్పుడు ఆ లొకేషన్ ను ఇక్కడ సెట్ రూపంలో వేసి వాడుకోవాలని ప్రయత్నంలో రాజమౌళి ఉన్నారట .. ఇప్పటికే అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ భారీ సెట్ వేస్తున్నట్టు తెలుస్తుంది .. అలాగే మణికర్ణిక ఘాట్‌కి ఓ ప్రత్యేకత కూడా ఉంది .. అది ఏమిటంటే అక్కడ ఎప్పుడూ చితి కాలుతూనే ఉంటుంది .. ఎక్కువమంది కాశీలో చనిపోవాలని కోరుకుంటారు. తద్వారా వాళ్లకు పుణ్యం వస్తుందని స్వర్గానికి వెళ్తారని అందరూ నమ్ముతారు .. అందువల్లే ఈ ఘాట్ వద్ద నిత్యం చాలా మంది చనిపోతూ ఉంటారు .. అందుకే అక్కడ శవాలు కాలుతూ ఉంటాయి .. ఈ ప్రాసెస్ లోనే ఇక్కడ మహేష్ బాబు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చిత్రీకరించే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నారట. ఇక మరి రాజమౌళి , మహేష్ బాబుతో తెర్కక్కించే ఈ సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కొత్త సంచనలు క్రియేట్ చేస్తారో చూడాలి.