టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.క్రియేటివిటీకి మారుపేరు ఈ స్టార్ డైరెక్టర్ఫ్యామిలీ సినిమాలకు పెట్టింది పేరు కృష్ణవంశీ సిందూరం లాంటి పవర్ఫుల్ ఎమోషనల్ మూవీ తర్వాత కృష్ణవంశీ ఫ్యామిలీ సినిమాలను తెరకెక్కించడం మొదలు పెట్టారు. మహేష్ బాబు కెరీర్ లో మొట్టమొదటి మైలు రాయిగా నిలిచినా మురారి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. నాగార్జునను రొమాంటిక్ హీరోగా ఎలివేట్ చేస్తూ నిన్నే పెళ్లాడతా లాంటి సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. అలాగే ఖడ్గం లాంటి దేశ భక్తి సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఇలా ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అందుకున్న కృష్ణవంశీ ఇటీవల కాలంలో సైలెంట్ అయ్యారు. చివరిగా ఆయన తెరకెక్కించిన నక్షత్రం సినిమా ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. ఈ మూవీ 2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న కృష్ణవంశీ రాగమార్తాండ సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చారు.ఇదిలావుండగా సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప 2 మూవీ, పాన్ ఇండియా లెవెల్‌లో బాక్సాఫీస్ దగ్గర రికార్డు వసూళ్లు రాబట్టింది. ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

అయితే ఈ సినిమా మీద వచ్చిన విమర్శలు కూడా అన్నీ ఇన్నీ కావు. స్మగ్లింగ్ చేసేవాడిని హీరోగా చూపించడం, అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించే పోలీసులని విలన్లుగా చూపించడం ఎంత వరకూ కరెక్ట్ అంటూ తీవ్రంగా తప్పుబట్టారు కొందరు విశ్లేషకులు.అటువంటి వారిలో కృష్ణవంశీ ఒకరు.అసలు విషయమేమిటంటే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్‌గా ఉండే డైరెక్టర్ కృష్ణవంశీ, అభిమానుల ప్రశ్నలకు తనదైన స్టైల్‌లో సమాధానాలు చెబుతూ ఉంటాడు. ఓ అభిమాని, కృష్ణవంశీ నుంచి ఓ హార్రర్ మూవీ ఆశిస్తున్నట్టుగా కామెంట్ చేశాడు. దానికి స్పందించిన కృష్ణవంశీ, నేను కూడా హార్రర్ మూవీ చేయాలని ఎంతో ఆసక్తిగా ఉన్నాను. కచ్ఛితంగా చేస్తాను అంటూ రిప్లై ఇచ్చాడుదీనికి మరో అభిమాని, ఓ రాబరీ మూవీ కూడా చేయండి సార్ అంటూ కామెంట్ చేశాడు. దానికి డైరెక్టర్ కృష్ణవంశీ, చెడ్డపనిని గొప్పగా చూపించడం అసలు ఏ మాత్రం కరెక్ట్ కాదు. నేను అస్సలు అలా చేయలేను సినిమా అనేది జనాల్లో మంచి ఆలోచనలు తెచ్చేలా ఉండాలి కానీ చెడ్డ పనులకు పురిగొలిపేలా ఉండకూడదని నేను అనుకుంటాను,అంటూ సమాధానం ఇచ్చాడు.అలాగే డబ్బుల కోసం ఇలా నేను తప్పుడు పనులను గొప్పగా చూపించలేనంటూ వ్యాఖ్యానించడం అందరిని ఆశ్చర్యపరిచింది.ఇదిలావుండగా కృష్ణవంశీ, చివరిగా 2023లో ప్రకాశ్ రాజ్‌తో రంగమార్తాండ అనే మూవీ చేశాడు. 2023లో విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ కావడంతో డైరెక్టర్ కృష్ణవంశీ, మరో సినిమా అనౌన్స్ చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: