నందమూరి హీరో బాలయ్య రీసెంట్గా డాకు మహారాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి రోజే బాక్సాఫీస్ షేక్ అయ్యే కలెక్షన్స్ ను వసూల్ చేసింది. ఇప్పటికి అదే జోరు తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. బాలయ్య ఒక మూవీ లైన్లో ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.. ప్రస్తుతం తన ఆస్థాన డైరెక్టర్ అయినటువంటి బోయపాటీ శ్రీను దర్శకత్వంలో అఖండ 2 తాండవం మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పనులు మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది.. బాలయ్య ఫ్యాన్స్ కు ఇదే బిగ్ సర్ ప్రైజ్ అనే చెప్పాలి.ప్రస్తుతం బాలయ్య డాకు మహారాజ్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.గత కొన్నేళ్లుగా బాలయ్య నటిస్తున్న సినిమాలు వరుసగా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంటున్నాయి. ఈ సంక్రాంతికి కూడా బాలయ్య భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత కూడా బాలయ్య నుంచి క్రేజీ లైనప్ ఉండగా ఇందులో తన కంబ్యాక్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో చేస్తున్న అవైటెడ్ సీక్వెల్ చిత్రం అఖండ 2 తాండవం కూడా ఒకటి. 

మరి ఈ సినిమా పట్ల యూనానిమాస్ గా సాలిడ్ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ మూవీ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. గతంలో ఈ కాంబోలో వచ్చిన అఖండ మూవీకి ఇది సీక్వెల్ గా రాబోతుంది. బోయపాటి కాంబోలో ఇప్పటికే కొన్ని సినిమాలను చేశాడు బాలయ్య. అవి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచాయి. దాంతో ఇప్పుడు రాబోతున్న సినిమా పై కూడా అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి.ఈ మూవీ గత ఏడాది పూజా కార్యక్రమాలతో షూటింగ్ మొదలు పెట్టారు.ఆల్రెడీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో బాలయ్య లుక్ అదిరే లెవెల్లో ఉంటుంది అని టాక్ వచ్చింది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పై ఇపుడు మరో టాక్ వినిపిస్తుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మహా శివరాత్రి కానుకగా రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. బాలయ్యపై బోయపాటి మంచి పవర్ఫుల్ లుక్ ని సిద్ధం చేయగా అది శివరాత్రి కానుకగా రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఇదే కనుక నిజమైతే ఫ్యాన్స్ కు శివరాత్రికి శివ తాండవమే మరి ఇక ఈ మూవీలో ముందుగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుందని ప్రకటించారు. కానీ ఆమె సినిమా నుంచి తప్పుకుంది.ఇప్పుడు ఆమె స్థానంలోకి సంయుక్త మీనన్ వచ్చింది. త్వరలోనే ఈ మూవీ పూర్తి వివరాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి సెప్టెంబర్ 25 న రిలీజ్ చేసేందుకు డేట్ ను అనౌన్స్ చేశారు. ఈ మూవీతో బాలయ్య ఎలాంటి రికార్డులను కైవసం చేసుకుంటాడో చేసుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: