దిల్ రాజుకు సంక్రాంతి సినిమాలలో ఒక సినిమాను కిందికి తీసి మరో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాడనే అర్థం వచ్చేలా అల్లు అరవింద్ కామెంట్లు చేశారు. అయితే తండేల్ రిలీజ్ ముంగిట ఇలాంటి కామెంట్లు అవసరమా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అల్లు అరవింద్ కెరీర్ పరంగా తప్పటడుగులు వేస్తున్నారనే అభిప్రాయాలు సైతం వినిపిస్తుండటం గమనార్హం.
తండేల్ రిలీజ్ సమయంలో సినిమాపై నెగిటివిటీ వచ్చే దిశగా అడుగులు వేయడం ఏంటనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. తండేల్ సినిమా నాగచైతన్య కెరీర్ కు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగచైతన్య తండేల్ మూవీ కెరీర్ బెస్ట్ హిట్ గా నిలుస్తుందని ఫీలవుతున్నారు. గత కొన్నేళ్లుగా చైతన్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుసగా నిరాశకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే.
2025 సంవత్సరం పెద్ద సినిమాలకు ఇప్పటివరకు ఒకింత కలిసిరాగా తండేల్ సినిమా ఆ మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందేమో చూడాలి. తండేల్ మూవీలో పాక్ బ్యాక్ డ్రాప్ సీన్లు కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంటాయని భోగట్టా. తండేల్ మూవీ బాక్సాఫీస్ వద్ద కూడా తండేల్ అనిపించుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తండేల్ సినిమా పాన్ ఇండియా మూవీగా ఇతర భాషల్లో సైతం విడుదల కానుంది. తండేల్ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తండేల్ మూవీలో రెండే రెండు యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాకు సెన్సార్ టాక్ సైతం పాజిటివ్ గా ఉంది.