సినిమా ఇండస్ట్రీ లో కొన్ని సందర్భాలలో ఒక తేదీన అనుకున్నా సినిమాలు పోస్ట్ పోన్ అయ్యి మరో తేదీన విడుదల అవడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఈ సంవత్సరం ఫిబ్రవరి 14 వ తేదీన విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించిన ఓ సినిమా పోస్ట్ పోన్ కానున్నట్లు తెలుస్తోంది. అలాగే ఫిబ్రవరి నెలలో 21 వ తేదీన విడుదల కాబోయే మరో మూవీ కూడా పోస్ట్ పోన్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఫిబ్రవరి 14 వ తేదీన పోస్ట్ పోన్ అయిన మూవీ , 21 వ తేదీన పోస్ట్ పోన్ అయిన మూవీ రెండు కూడా ఫిబ్రవరి 26 వ తేదీన విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఆ సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి కిరణ్ అబ్బవరం "దిల్ రూబా" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాను ఫిబ్రవరి 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన సంగీత పనులు బ్యాలెన్స్ ఉన్నట్లు , దానితో ఈ సినిమాను పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ ని ఫిబ్రవరి 26 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే టాలీవుడ్ యువ నటుడు సందీప్ కిషన్ తాజాగా మజాకా అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని ఫిబ్రవరి 21 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమాను కూడా మేకర్స్ పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు , ఈ మూవీ ని ఫిబ్రవరి 26 వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇలా ఈ రెండు సినిమాలు కూడా ఫిబ్రవరి 26 వ తేదీన విడుదల అయ్యే ఛాన్సెస్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: