టాలీవుడ్ నటుడు అక్కినేని నాగ చైతన్య తాజాగా తండెల్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ టాలెంటెడ్ నటీమణి సాయి పల్లవి హీరోయిన్గా నటించగా ... చందు మండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ , బన్నీ వాసు ఈ మూవీ ని నిర్మించగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఫిబ్రవరి 7 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.

అందులో భాగంగా నిన్న రాత్రి ఈ సినిమా బృందం వారు ఈ మూవీకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.  ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఇకపోతే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా సందీప్ రెడ్డి వంగా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో ఫుల్ గా మహిళలు అవుతున్నాయి. తండెల్ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ ... యానిమల్ సినిమా కోసం కాస్ట్యూమ్ డిజైనర్ కి చైతన్య రియల్ లైఫ్ లో వేసుకునే కాస్ట్యూమ్స్ ని రిఫరెన్స్ గా చూపించాను అని సందీప్ రెడ్డి వంగా చెప్పుకొచ్చాడు.

ఇకపోతే సందీప్ రెడ్డి వంగా , విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన అర్జున్ రెడ్డి మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత అదే సినిమాను హిందీ లో కబీర్ సింగ్ పేరుతో రీమిక్ చేసి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆఖరుగా ఈయన రన్బీర్ కపూర్ హీరోగా యానిమల్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Srv