సినిమా రంగంలో ఒక వెలుగు వెలిగి అకస్మాత్తుగా కనుమరుగైన హీరోయిన్స్ చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ హీరోయిన్ సనా ఖాన్ కూడా ఒకరని చెప్పవచ్చు.. బాలీవుడ్లో మొదట తన కెరీర్ని ప్రారంభించిన ఈ అమ్ముడు తెలుగులో కత్తి, గగనం, మిస్టర్ నూకయ్య తదితర చిత్రాలలో నటించింది. బాలీవుడ్ లో కూడా సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలకు జోడిగా నటించిన ఈమె సినిమా కెరియర్ ఫుల్ పీక్స్ లో ఉన్న సమయంలోనే 2020 లో సనా ఖాన్  సినిమాలకు దూరమైపోయింది.


అయితే ఆ తర్వాత దుబాయ్ కి చెందిన ఒక ముస్లిం మత గురువును వివాహం చేసుకున్నది సనా. తర్వాత ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. అయితే సినీ ఇండస్ట్రీలో ఉన్న సమయాలలో ఈమె ప్రముఖ డాన్సర్ స్టార్ కొరియోగ్రాఫర్ అయిన మెల్విన్ లూయిస్ తో డేటింగ్ చేసిందట. కొంతకాలానికే వీరిద్దరూ విడిపోవడం జరిగిందట. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఒక వీడియోని షేర్ చేసిన సనా అసలు విషయాన్ని బయటపెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


సనా ఆ వీడియోలో ఇలా తెలియజేస్తూ మెల్విన్ చాలా అబద్దాలు చెప్పి తనని మోసం చేశారని.. అతను మైనర్ బాలికలకు తరచూ డ్రగ్స్ ఇచ్చి వారిని ప్రెగ్నెంట్ చేసేవారని చాలామంది అమ్మాయిలనుంచి డబ్బులు అక్రమంగా తీసుకున్నారని అతని చేతిలో మోసపోయిన అమ్మాయిలు చాలామంది ఉన్నారంటే తెలియజేయడమే కాకుండా తనను కూడా చాలాసార్లు కొట్టారని.. చాలా అసభ్యకరమైన మాటలు కూడా మాట్లాడేవారని మెల్వేన్ నిజస్వరూపాన్ని కనుక్కోవడానికి తనకి ఒక ఏడాది వరకు పట్టింది అంటూ వెల్లడించింది సనా. మొత్తానికి ఈ వ్యాఖ్యలు చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కానీ కొరియోగ్రాఫర్ అయిన మెల్వీన్ మాత్రం ఈ విషయాలను ఖండించినట్లు వార్తలు వినిపించాయి. సనా ఖన్ 18 సంవత్సరాలకి మోడలింగ్ గా అడుగుపెట్టి ఆ తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 18 సినిమాల పలు రకాల యాడ్లలో కూడా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: