టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపుని ఏర్పరచుకున్న వారిలో నాగ చైతన్య ఒకరు. ఈయన జోష్ అనే మూవీ తో జోష్ మూవీతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత నాగ చైతన్య "ఏం మాయ చేసావే" అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.

సినిమా తర్వాత నుండి నాగ చైతన్య ఎక్కువ శాతం లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లలో నటించి మంచి విజయాలను అందుకొని మంచి గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు. ఇకపోతే గత కొంత కాలంగా నాగ చైతన్య కు బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన విజయం లేదు. కొంత కాలం క్రితం ఈయన దూత అనే వెబ్ సీరీస్ తో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా చైతన్య , చెందు మండేటి దర్శకత్వంలో రూపొందిన తండెల్ అనే సినిమాలో హీరో గా నటించాడు. సాయి పల్లవిమూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని ఫిబ్రవరి 7 వ తేదీన విడుదల చేయనున్నారు. దానితో నిన్న అనగా ఫిబ్రవరి 2 వ తేదీ రాత్రి ఈ మూవీ బృందం వారు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు.

సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సందీప్ రెడ్డి వంగ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ ... నాగ చైతన్య హీరో గా రూపొందిన మజిలీ మూవీ ఫంక్షన్ కి నేను వెళ్ళాను. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఫంక్షన్ కి కూడా నేను వచ్చాను. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను అని సందీప్ రెడ్డి వంగా తాజాగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే తండెల్ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: