ఫిదా సినిమాతో ప్రతి ఒక్కరికి పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే ఎంతగానో గుర్తింపు దక్కించుకుంది. తెలుగు అభిమానులు వారి ఇంటి అమ్మాయి వలె సాయి పల్లవిని ఆదరించడం గమనార్హం. కాగా, సాయి పల్లవి నటించిన తాజా చిత్రం తండెల్. ఫిబ్రవరి ఏడవ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటించగా....సాయి పల్లవి హీరోయిన్గా చేసింది. వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకే వచ్చిన లవ్ స్టోరీ సినిమా మంచి విజయాన్ని అందుకోగా మరోసారి వీరిద్దరూ కలిసి జంటగా నటించారు.
ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించాడు. అల్లు అరవింద్, బన్నీ వాసు నిర్మాతలుగా వ్యవహరించారు. కాగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ వేదికగా తండేల్ జాతర పేరుతో ఈవెంట్ ను నిర్వహించారు. ఈవెంట్ కి చిత్ర బృందంతో పాటు డైరెక్టర్ అర్జున్ రెడ్డి, దిల్ రాజు రావడం విశేషం. ఈవెంట్ లో ప్రతి ఒక్కరూ సాయి పల్లవిని ఎంతగానో అభినందించారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ..... సాయి పల్లవి నటనను ఎంతగానో మెచ్చుకున్నారు. అంతేకాకుండా తాను దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి సినిమాలో మొదట హీరోయిన్ గా సాయి పల్లవిని అడిగారట.
కానీ కోఆర్డినేటర్ నో అని చెప్పినట్లుగా సందీప్ గుర్తు చేసుకున్నాడు. సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు కాస్తా ఎక్కువగా ఉంటాయని చెప్పడంతో సాయి పల్లవి కనీసం స్లీవ్ లెస్ డ్రెస్ కూడా వేసుకోదని చెప్పి ఈ సినిమాను సాయి పల్లవి అసలు చేయదు అని చెప్పాడట. ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా శాలిని పాండేను ఎంపిక చేసామని చెప్పారు. కాగా, సాయి పల్లవి అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉందంటూ సందీప్ రెడ్డి వంగ అభినందించారు.