ప్రతి సంవత్సరం వాలంటైన్స్ డే సినీ అభిమానులకు ఒకింత ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే. 2025 సంవత్సరంలో కూడా వాలంటైన్స్ డే సందర్భంగా ఎక్కువ సంఖ్యలో సినిమాలు రిలీజవుతున్నాయి. విశ్వక్ సేన్ లైలా మూవీ వాలంటైన్స్ డే డేట్ పై కన్నేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఇప్పటికే ఊహించని స్థాయిలో ప్రమోషన్స్ జరుగుతుండటం గమనార్హం. విశ్వక్ సేన్ ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది.
 
వాలంటైన్స్ డే రేసులో సిద్ధు జొన్నలగడ్డ మూవీ నిలవడం ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఈ సినిమా కొత్త సినిమా కాదు. ఐదేళ్ల క్రితం విడుదలైన కృష్ణ అండ్ హిజ్ లీల ఓటీటీ సినిమాను ఇప్పుడు థియేటర్లలో ఇట్స్ కాంప్లికేటెడ్ అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ విధంగా రిలీజ్ చేయడం వెనుక అసలు రీజన్ ఏంటనే ప్రశ్నకు సంబంధించి మాత్రం జవాబు దొరకాల్సి ఉంది.
 
ఈ సినిమాకు నిర్మాత రానా రాగా ఓటీటీలో విడుదలైన సినిమాను ఇలా థియేటర్లలో రిలీజ్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ సినిమాకు ఏ స్థాయిలో కలెక్షన్లు వస్తాయో చూడాల్సి ఉంది. సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటానని నిర్మాత రానాకు హామీ ఇచ్చేశారు. సిద్ధు జొన్నలగడ్డకు ఈ సినిమా ఎంతమేర ప్లస్ అవుతుందో చూడాలి.
 
ఈ ప్లాన్ వర్కౌట్ అయితే డైరెక్ట్ గా ఓటీటీలలో విడుదలైన మరికొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించాయి. సిద్ధు జొన్నలగడ్డ తర్వాత సినిమాలు ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తాయో చూడాలి. సిద్ధు జొన్నలగడ్డ సినిమాలకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: