టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఒకరు. ఈ చిన్నది ఒక లైలా కోసం అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే ప్రతి ఒక్క సినీ అభిమానిని ఆకట్టుకుంది. ఆ సినిమా అనంతరం తెలుగులో వరుసగా కొన్ని సినిమాలలో నటించింది. దాదాపు స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా చేసింది.


ముఖ్యంగా అలా వైకుంఠపురం సినిమాలో ఈ చిన్నదాని నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. ఆ సినిమాలో తన అద్భుతమైన నటనకు గాను ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా అనంతరం పూజ హెగ్డే సినీ ఇండస్ట్రీలో కొన్ని ఏళ్లపాటు తన హవాను కొనసాగిస్తుందని ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ అదంతా రివర్స్ అయిపోయింది. అలా వైకుంఠపురం సినిమా తర్వాత ఈ చిన్నదానికి పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు.


ఏవో కొన్ని సినిమాలలో మాత్రమే హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ వైపుకు ఈ బ్యూటీ వెళ్ళింది. అక్కడ వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం పూజ హెగ్డే బాలీవుడ్ సినిమాలతో బిజీగా గడుపుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ తన హవాను చాటుకుంటుంది. తాజాగా సోషల్ మీడియాలో ఈ చిన్నది కొన్ని ఫోటోలను తన అభిమానులతో పంచుకుంది.


ఆ ఫోటోలలో బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ ధరించి హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. బ్యాక్ టు బ్లాక్ అనే క్యాప్షన్ జత చేసి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇందులో బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ తో పాటు బ్లాక్ కలర్ గాగుల్స్ పెట్టుకొని లిఫ్ట్ లో స్టైల్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. దీంతో బుట్ట బొమ్మ ఈజ్ బ్యాక్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: