యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య గురించి చెప్పనవసరం లేదు. తనదైన నటనతో ఎన్నో సినిమాలలో నటించారు. ఈ హీరో ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా తన సినిమాలతో సక్సెస్ కాలేకపోతున్నారు. తాను నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు మాత్రమే మంచి విజయాలను అందుకున్నాయి. అందులో లవ్ స్టోరీ సినిమా ఒకటి. ఈ సినిమా అనంతరం అక్కినేని నాగచైతన్య నుంచి వచ్చిన మరో సినిమా తండెల్. ఈ సినిమాలో నాగచైతన్య సరసన హీరోయిన్ గా సాయి పల్లవి నటించింది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండవ సినిమా తండేల్ కావడం విశేషం. 


ఈ సినిమాకు డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించారు. బన్నీ వాసు, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్నారు. తండెల్ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన రిలీజ్ కానుంది. దీంతో సినిమా ప్రమోషన్లను వేగంగా జరుపుతున్నారు. ఆదివారం రోజున హైదరాబాద్ వేదికగా తండెల్ జాతర పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజు, దర్శకుడు సందీప్ రెడ్డి వంగ చీఫ్ గెస్ట్ లుగా విచ్చేసి సందడి చేశారు. 

కాగా, ఈవెంట్ లో నిర్మాత అల్లు అరవింద్ సంతోషంలో మునిగిపోయారు. తండెల్ జాతర ఈవెంట్ లోను అల్లు అరవింద్ డాన్స్ చేయడం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. అందులో భాగంగా యాంకర్ సుమతో కలిసి హైలెస్సో హైలెస్సా అనే పాటకు వీరిద్దరూ కలిసి స్టెప్పులు వేశారు. దీంతో పుష్ప కా బాప్ అంటే తగ్గేదేలే అంటూ అభిమానులు విపరీతంగా కామెంట్ చేస్తున్నారు. 


కాగా, తండెల్ సినిమా ఈనెల 7వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకే వచ్చిన లవ్ స్టోరీ సినిమా మంచి విజయాన్ని అందుకోగా.... ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మరి ఈ సినిమా ఏ మేరకు విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: